తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐఓసీ నిషేధం​ ఉన్నా భారత్​లోనే హాకీ సిరీస్​

భారత్​కు క్రీడా నిర్వహణలో కొంత ఊరట కలిగింది. ఐఓసీ నిషేధం ఉన్నా హాకీ సిరీస్​ ఫైనల్స్​కు ఆతిథ్యం ఇచ్చేందుకు  అనుమతి లభించింది. యథావిథిగానే జూన్ ​నెలలో ఈ క్రీడలను నిర్వహించనున్నారు.

ఐఓసీ నిషేధం​ ఉన్నా.. భారత్​లోనే హాకీ సిరీస్​

By

Published : Apr 3, 2019, 2:10 PM IST

భువనేశ్వర్​లో హాకీ సిరీస్​ ఫైనల్స్​ నిర్వహించనున్నట్లు ప్రకటించింది భారత ఒలింపిక్​ అసోషియేషన్​(ఐఓఏ). వీటి నిర్వహణపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో వివరణ ఇచ్చింది.

  • భారత ఒలింపిక్​ అసోషియేషన్​(ఐఓఏ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్​ 6 నుంచి 16 వరకు హకీ సిరీస్​ ఫైనల్స్​ను ఒడిశాలోని భువనేశ్వర్​లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కచ్చితంగా గెలవాల్సిందేనా..!

ఉగ్రదాడికి నిరసనగా హాకీ ప్రో లీగ్​ నుంచి భారత్​ బయటకు వచ్చేసింది. ప్రస్తుతం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న హాకీ సిరీస్​ ఫైనల్స్​లో.. కచ్చితంగా గెలిస్తేనే భారత్​ ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తుంది.

  1. ప్రపంచవ్యాప్తంగా మూడు హాకీ సిరీస్​ ఫైనల్స్​ నిర్వహిస్తారు. ఎనిమిది జట్లు పోటీ పడతాయి. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారే 2020లో టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తారు.
  2. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్​ అధ్యక్షుడు నరీందర్ బత్రా.. భారత ఒలింపిక్​ సంఘానికి చీఫ్​గా వ్యవహరించడం విశేషం.

ఏం జరిగింది...?

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్​-పాక్​ మధ్య క్రీడల్లోనూ సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ముగ్గురు పాక్​ షూటర్లకు వీసాలు నిరాకరించింది భారత్​.

  • దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ(ఐఓసీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. క్రీడా ఒప్పందాల ఉల్లంఘన కింద పరిగణిస్తూ భారత్​లో ఎలాంటి అంతర్జాతీయ క్రీడలు నిర్వహించకూడదని వేటు వేసింది.

ఐఓసీ నిషేధం​ నేపథ్యంలో జులైలో భారత్​లో జరగాల్సిన కుస్తీ జూనియర్​ ఆసియన్​ ఛాంపియన్​షిప్​ పోటీలు విదేశాలకు తరలి వెళ్లాయి.

ABOUT THE AUTHOR

...view details