తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాకీ ఇండియాకు ప్రతిష్టాత్మక అవార్డు - ఎటియన్నే గ్లిచిచ్ అవార్డు

అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ 47వ కాంగ్రెస్ సందర్భంగా అవార్డులను ప్రకటించింది. దేశంలో హాకీ అభివృద్ధికి, ఉన్నతికి చేసిన కృషికి గానూ హాకీ ఇండియాకు ప్రతిష్టాత్మక ఎటియన్నే గ్లిచిచ్​ అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించినందుకు గానూ ఉజ్బెకిస్థాన్​కు పాబ్లో నెగ్రే అవార్డు వరించింది.

hockey india, Etienne Glichitch Award
హాకీ ఇండియా, ఎటియన్నే గ్లిచిచ్ అవార్డు

By

Published : May 21, 2021, 10:27 PM IST

హాకీ ఇండియాకు ప్రతిష్టాత్మక ఎటియన్నే గ్లిచిచ్ అవార్డు దక్కింది. దేశంలో హాకీ అభివృద్ధికి చేసిన ఎనలేని కృషికి గానూ ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్​ఐహెచ్​)​ 47వ కాంగ్రెస్​లో భాగంగా ఈ అవార్డులను ప్రకటించింది ఎఫ్​ఐహెచ్​. హాకీ అభివృద్ధిలో భాగమైన వ్యక్తులు, సంస్థలు, బృందాలకు.. ఈ అవార్డును ఇస్తారు.

హాకీలో మౌలిక సదుపాయాల కల్పన, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి చేసిన కృషికి గానూ ఉజ్బెకిస్థాన్​కు పాబ్లో నెగ్రే అవార్డు వరించింది.

మరికొన్ని అవార్డులు..

  • పోలిష్​ హాకీ అసోసియేషన్​కు థియో ఇకెమా అవార్డు లభించింది. హాకీ ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు కొత్తగా 30 మంది కోచ్​లను నియామకం చేశారు. దీని వల్ల 3000 మంది పాఠశాల పిల్లలు కొత్తగా హాకీకి పరిచయమయ్యారు.
  • సూపర్ ఫెయిర్ ప్లే ట్రోఫీ రెనే జి ఫ్రాంక్ అవార్డు.. ఇంగ్లాండ్ స్ట్రైకర్​ సామ్​ వార్డ్​కు దక్కింది.
  • హాకీలో అంపైరింగ్​కు పెట్టింది పేరైనా ఐవోనా ముకార్​.. ది గస్ట్​ లాథోవర్స్​ మెమోరియల్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
  • సుల్తాన్​ అజ్లాన్ షా హకీ అవార్డును న్యూజిలాండ్​కు చెందిన షారన్ విలియమ్సన్​ అందుకున్నాడు. ఆక్లాండ్​లో కొత్త జాతీయ హాకీ సెంటర్​ కోసం ఆయన కృషి చేశాడు.

ఇదీ చదవండి:'జపాన్​లో ఎమర్జెన్సీ పెట్టినా.. ఒలింపిక్స్ ఆగదు'

ABOUT THE AUTHOR

...view details