భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై 5-0 తేడాతో గెలిచింది. సెమీస్‌లో ఆతిథ్య జపాన్‌పై సత్తాచాటిన హాకీ టీమిండియా... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది.
అదరగొట్టిన భారత ఆటగాళ్లు...

ఏడో నిమిషంలోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌తో శుభారంభం అందించాడు. అనంతరం 18 నిమిషంలో షంషేర్ సింగ్, 22వ నిమిషంలో నీలకంఠ శర్మ, 26వ నిమిషంలో గుర్సబిజిత్ సింగ్, 27వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్స్‌తో ప్రత్యర్థిని వణికించారు.
తొలి అర్ధభాగంలో భారత్ దూకుడు ప్రదర్శించి ఆధిక్యంలో నిలిచింది. 37వ నిమిషంలో ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశమొచ్చినా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత డిఫెన్స్‌ను ఛేదించలేక చతికిలపడింది కివీస్. లీగ్ దశలో 1-2 తేడాతో న్యూజిలాండ్‌పై ఓడిన హాకీ ఇండియా... తుదిపోరులో నెగ్గి ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
హాకీ జట్టుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.