పురుషుల హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని ఆసియన్ హాకీ సమాఖ్య గురువారం అధికారికంగా ప్రకటించింది. ఢాకా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 1-9 వరకు జరుగుతాయని వెల్లడించింది.
"కొవిడ్ పరిస్థితుల వల్ల 2020 నవంబర్లో జరగాల్సిన ఈ ట్రోఫీ.. 2021కి వాయిదా పడింది. సంబంధిత ట్రోఫీ తేదీలను బంగ్లాదేశ్ హాకీ సమాఖ్య నిర్ణయించింది. బంగ్లా ఆతిథ్యమివ్వనున్న విషయాన్ని ప్రపంచ హాకీ సమాఖ్య ధ్రువీకరించింది."