తెలంగాణ

telangana

ETV Bharat / sports

మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో కరోనా హాకీ ప్లేయర్స్ - భారత హాకీ జట్టుకు కరోనా

కరోనా సోకిన భారత హాకీ జట్టు ఆటగాళ్లను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించింది సాయ్​. బాధితుల్లో సారథి మన్​ప్రీత్ ​సింగ్​, స్ట్రైకర్​ మన్​దీప్​​ సింగ్​, జస్కరన్​ సింగ్​, సురేందర్​ కుమార్​, వరుణ్​ కుమార్​, క్రిష్ణన్​ బీ పాథక్​ ఉన్నారు.

SAI
సాయ్​

By

Published : Aug 12, 2020, 6:07 PM IST

కరోనా బారిన పడ్డ ఆరుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను బెంగళూరులోని ఎస్​ఎస్​ స్పార్ష్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (సాయ్​) తెలిపింది. ప్రస్తుతం ప్లేయర్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. మెరుగైన వైద్యం అందించేందుకే వారిని తరలించినట్లు వెల్లడించింది. జట్టు సారథి మన్​ప్రీత్ ​సింగ్​, స్ట్రైకర్​ మన్​దీప్​ సింగ్​, జస్కరన్​ సింగ్​, సురేందర్​ కుమార్​, వరుణ్​ కుమార్​, క్రిష్ణన్​ బీ పాథక్​కు ఇటీవలే కరోనా సోకింది.

సాయ్​

బెంగళూరులోని జాతీయ శిక్షణ శిబిరానికి చేరే ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఈ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. ఈ నెల 20 నుంచి శిబిరం ఆరంభం కావాల్సి ఉంది.

స్ట్రైకర్​ మన్​దీప్​ సింగ్
మన్​ప్రీత్​ సింగ్​

ఇది చూడండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్​దీప్​ సింగ్​

ABOUT THE AUTHOR

...view details