ఇంగ్లాండ్ ఫుట్‌బాలర్, టోటెన్హామ్ హాట్స్పుర్ సారథి హ్యారీ కేన్.. వరుసగా మూడోసారి ప్రీమియర్ లీగ్ గోల్డెన్ బూట్ అవార్డును దక్కించుకున్నాడు. ఆదివారం లీసెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుపై 4-2తేడాతో టోటెన్హామ్ గెలిచింది. అయినప్పటికీ ఈ లీగ్‌లో 62పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది టోటెన్హామ్.
హ్యారీ కేన్‌కు గోల్డెన్ బూట్ అవార్డు
ఈ సీజన్ ప్రీమియర్ లీగ్ గోల్డెన్ బూట్ టోటెన్హామ్ సారథి హ్యారీ కేన్‌ను వరించింది. ఈ అవార్డు దక్కించుకోవడం కేన్‌కు ఇది వరుసగా మూడోసారి.
హ్యారీ కేన్
మొత్తంగా ఈ సీజన్‌ను లివర్‌పూల్ కెప్టెన్ మహ్మద్ సాలా 22 గోల్స్‌తో ముగించగా.. కేన్ 23 గోల్స్‌తో ముగించి ఈ అవార్డును సాధించాడు. ఏడేళ్లలో ప్రీమియర్ లీగ్‌లో 20 గోల్స్ మార్క్‌ను కేన్ ఐదు సార్లు అందుకున్నాడు.