ఫుట్‌బాల్‌లో పెనాల్టీ షూటౌట్ల గురించి వినే ఉంటారు. నిర్ణీత సమయంలో.. స్కోరు సమమైతే ఇరు జట్లకూ చెరో 5 పెనాల్టీ షూటౌట్లకి అవకాశం ఇస్తారు. తాజాగా మెక్సికోలో జరిగిన ఓ అండర్-17 మ్యాచ్‌లో విచిత్రమైన పెనాల్టీ కిక్ కొట్టాడు డీగో అనే ఆటగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
గాల్లోకి లేచిందని వదిలేశాడు కానీ.. - ఫుట్‌బాల్
మెక్సికోలో జరిగిన అండర్-17 ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విచిత్రమైన పెనాల్టీ కొట్టాడు డీగో అనే ఆటగాడు. పోల్కి తగిలి గాల్లోకి లేచిన బంతి అనూహ్యంగా గోల్ పోస్టులోకి దూసుకొచ్చింది.
పెనాల్టీ కిక్
డీగో పెనాల్టీ షాట్ కొట్టగానే రివ్వున వెళ్లిన బంతి గోల్ పోల్కి తగిలి గాల్లో లేచింది. ఇంకేముంది గోల్ మిస్ అయిందని అందరూ అనుకున్నారు. విచిత్రంగా గాల్లో లేచిన బంతి ఒక్కసారిగా గోల్‌పోస్టులోకి దూసుకొచ్చింది. గోల్‌కీపర్ కూడా ఈ విషయం గమనించలేదు. ఈ మ్యాచ్‌లో డీగో జట్టు 6-1 తేడాతో గెలిచింది.
ఇది చదవండి:'సింగపూర్ ఓపెన్'పైనే భారత షట్లర్ల ఆశలు