తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాకర్​ దిగ్గజం​ మెస్సీపై 3 నెలల నిషేధం - argentina

దక్షిణ అమెరికా ఫుట్​బాల్ కాన్​ఫెడరేషన్(కాన్​మెబోల్​) అర్జెంటీనా ఫుట్​బాల్ ఆటగాడు లియోనల్​ మెస్సీపై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

మెస్సీ

By

Published : Aug 3, 2019, 11:06 AM IST

అర్జెంటీనా ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీపై సస్పెన్షన్ విధించింది దక్షిణ అమెరికా ఫుట్​బాల్ కాన్​ఫెడరేషన్. మూడు నెలలపాటు అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడకుండా నిషేధించింది. కోపా అమెరికా టోర్నీలో చిలీతో మ్యాచ్​ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మెస్సీకి 50వేల యూఎస్ డాలర్లు(రూ. 34లక్షల పైనే) జరిమానా విధించింది. నిషేధం వేటుతో సెప్టెంబర్​లో చిలీ, మెక్సికో... అక్టోబరులో జర్మనీతో మ్యాచ్​లకు మెస్సీ దూరం కానున్నాడు.

ఈ అంశంపై మెస్సీ కానీ, అర్జెంటీనా సాకర్ బోర్డు కానీ స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అప్పీలు చేసుకోడానికి వారికి ఇంకా అవకాశముంది. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన దక్షిణఅమెరికా ప్రపంచకప్​ అర్హత పోటీల్లో తొలి మ్యాచ్​కు దూరమయ్యాడు మెస్సీ. చిలీతో మ్యాచ్​లో పదే పదే రెడ్ కార్డుకు గురైన కారణంగా ఈ వేటు పడింది.

మెస్సీ

అసలు మెస్సీ చేసిందేంటి?

కోపా అమెరికా టోర్నీలో బ్రెజిల్​పై అర్జింటీనా 2-0 తేడాతో ఓడింది.బ్రెజిల్​ను గెలిపించేందుకే ఈ టోర్నీ నిర్వహించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మెస్సీ. చిలీతో మ్యాచ్​ అనంతరం అవార్డుల ప్రదానోత్సవానికీ రాలేదు. "ఈ అవినీతిలో పాలు పంచుకోవాలనుకోవట్లేదని" అన్నాడు. ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు కూడా ఇచ్చాడు.

ఇది చదవండి: రొనాల్డో నాకు స్ఫూర్తినిచ్చాడు: విరాట్​ కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details