తెలంగాణ

telangana

ETV Bharat / sports

కీలకపోరుకు సిద్ధమైన భారత జట్టు

ప్రపంచకప్, ఆసియా కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో సత్తాచాటేందుకు సిద్ధమైంది భారత ఫుట్​బాల్ జట్టు. 2023 ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనాలి అంటే ఈ పోరులో విజయం సాధించడం అత్యవసరం.

By

Published : Jun 7, 2021, 8:40 AM IST

football
భారత జట్టు

ఇప్పటికే క్వాలిఫయింగ్‌ రౌండ్లలో విఫలమై ప్రపంచకప్‌ రేసు నుంచి నిష్క్రమించిన భారత ఫుట్‌బాల్‌ జట్టు.. ఆసియా కప్‌ అర్హత దిశగా కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్‌, ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో సోమవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 2023 ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనాలి అంటే ఈ పోరులో విజయం సాధించడం అత్యవసరం.

ప్రస్తుతం 105వ ర్యాంకులో ఉన్న భారత్‌.. 184వ స్థానంలో ఉన్న బంగ్లాతో పోరులో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. అయితే ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కాగా, కరోనా నుంచి కోలుకున్న భారత మిడ్‌ఫీల్డర్‌ అనిరుధ్‌ థాపా ఆదివారం జట్టుతో చేరాడు.

ABOUT THE AUTHOR

...view details