పోర్చుగల్ ఎఫ్‌సీ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్టో.. సాకర్‌లో మరో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బ్రెజిల్ దిగ్గజం పీలే నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు. ఆదివారం జువెంటస్ క్లబ్ తరఫున హ్యాట్రిక్(3) గోల్స్ చేసిన రొనాల్డో.. ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.
ఈ గోల్స్‌తో రొనాల్డో తన కెరీర్లో చేసిన గోల్స్ 770కి చేరాయి. సెరీ ఏ లీగ్‌లో భాగంగా కాగ్లియారీ ఫుట్‌బాల్ జట్టుతో జరిగిన గేమ్‌లో రొనాల్డో ప్రాతినిధ్యం వహంచిన జువెంటస్ 3-1తో గెలుపొందింది.
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు
ఫుట్‌బాల్ చరిత్రలో 767 గోల్స్‌తో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా పీలే గతంలోనే రికార్డు సాధించాడు. ఈ కాగ్లియారీ టీమ్‌తో మ్యాచ్‌కు ముందు పీలే రికార్డును సమం చేసిన రొనాల్డో.. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో పీలే రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా సాకర్‌లో అత్యధిక గోల్స్(770) చేసిన ఆటగాడిగా సరికొత్త ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు.
పోర్చుగల్ ఎఫ్‌సీతో పాటు వివిధ ఫుట్‌బాల్ క్లబ్‌ల తరఫున ఆడిన రొనాల్డో.. పోర్చుగల్ తరఫున 102, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 118, జువెంటస్ తరఫున 95, రియల్ మాడ్రిడ్ తరఫున 450, స్పోర్టింగ్ లిస్బన్ తరఫున 5 గోల్స్ చేశాడు.
ఇదీ చూడండి:పీలే రికార్డు తిరగరాసిన మెస్సీ.. ఏమన్నాడంటే?