తెలంగాణ

telangana

ETV Bharat / sports

68 గజాల దూరం నుంచి గోల్​.. వీడియో వైరల్​ - గోల్

68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి కోర్టులోని గోల్​పోస్ట్​లోకి పంపాడు డీసీ యునైటెడ్ ఆటగాడు వేస్​ రూనీ. కళ్లు చెదిరే రీతిలో చేసిన ఆ గోల్​కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నెట్టింట పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఫుట్​బాల్​

By

Published : Jun 28, 2019, 5:17 AM IST

Updated : Jun 28, 2019, 1:27 PM IST

లాంగేస్ట్ గోల్​ చేసిన రూనీ

ఫుట్​బాల్​.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకున్న క్రేజే వేరు. ఒక్క గోల్ కొట్టాలంటే ఇరు జట్ల ఆటగాళ్లు చెమటలు చిందిల్సాందే. ఈ కోర్టు నుంచి బంతిని అవతలి కోర్టులోని గోల్​పోస్ట్​కు సమీపంగా గోల్ కొట్టడం మాములు విషయం కాదు. అలాంటిది 68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్​లోకి పంపాడు ఇంగ్లాండ్ ప్లేయర్ వేస్ రూనీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది.

లాస్ ఏంజెల్స్​ వేదికగా మేజర్ సాకర్​లీగ్​లో ఓర్లాండోతో జరిగిన మ్యాచ్​లో డీసీ యునైటెడ్ ఆటగాడు వేస్ రూనీ ఈ ఘనత సాధించాడు. తన కోర్టులో నుంచి ప్రత్యర్థి కోర్టులోని గోల్ పోస్ట్​లో గోల్​ కొట్టాడు. ఆటగాళ్లంతా డీసీ జట్టు కోర్టులో ఉండడం గమనించిన రూనీ తెలివిగా గోల్​ చేశాడు. ఆ సమయంలో ప్రత్యర్థి గోల్ కీపర్​ బ్రియన్ రోవె సైతం గోల్​పోస్ట్​కు దూరంగా ఉన్నాడు. ఈ గోల్​కు​ మంత్రముగ్ధులైన అభిమానులు కేరింతలు కొట్టారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించారు.

ఇంగ్లాండ్​ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు వేస్​ రూనీ. అనంతరం దానికి వీడ్కోలు పలికి క్లబ్​ మ్యాచ్​లు ఆడుతున్నాడు. ప్రస్తుతం మేజర్ సాకర్ లీగ్​లో డీసీ యునైటెడ్​ తరఫున ఆడుతున్నాడు.

ఇది చదవండి: ఎదురులేని టీమిండియా.. విండీస్​పై అలవోక విజయం

Last Updated : Jun 28, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details