జువెంటస్ తరఫున ఆడుతోన్న రొనాల్డో అట్లెటికోతో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. అనంతరం అట్లెటికో మేనేజర్ డిగోపై రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించాడు. ఇప్పటికే ఈ ఘటనలో 20వేల యూరోల జరిమానా చెల్లించుకున్నాడు.
రొనాల్డోపై నిషేధం తప్పదా.! - juventes
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అట్లెటికోతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఫలితంగా 'యూఈఎఫ్ఏ' ఈ సాకర్ స్టార్‌పై నిషేధం విధించనుంది.
రొనాల్డోపైనిషేధం తప్పదా.!
రొనాల్డోపై యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ) చర్యలు తీసుకోనుంది. ఛాంపియన్స్ లీగ్‌లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మార్చి 21న జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆడకుండా నిషేధం విధించనుంది. అయితే ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కోచ్ మాసిమిలియానో మాత్రం క్రిష్టియానో బ్యాన్ ఎదుర్కొనే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డాడు.
'గెలిచినపుడు ఎవరి విధానంలో వాళ్లు సంబురాలు చేసుకుంటారు. రొనాల్డో అలానే ప్రవర్తించాడు. నిషేధం విధించాలన్న నిర్ణయం సరైంది కాదు.'
-జువెంటస్ కోచ్, మాసిమిలియానో