తాలిబన్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ పుట్‌బాల్ క్రీడాకారిణులు క్షేమంగా పాకిస్థాన్ చేరుకున్నారు. 32మంది అథ్లెట్లు తమ కుటుంబసభ్యులతో మానవతా ధృక్పథంతో పాక్ జారీ చేసిన అత్యవసర వీసాలతో పాక్‌కు చేరినట్లు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.
అఫ్గాన్ నేషనల్ జూనియర్ బాలికల టీమ్‌కు చెందిన ఈ క్రీడాకారిణులు తొలుల ఖతర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆగస్టు 26న కాబుల్‌లో జరిగిన బాంబు దాడి వల్ల అక్కడే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారు అక్కడే భయంభయంగా బతికారు. తమను కాపాడాలంటూ వీడియో సందేశాల ద్వారా ప్రార్థించారు. బ్రిటీష్ ఆధారిత ఎన్జీఓ సంస్థ 'ఫుట్‌బాల్ ఫర్ పీస్', 'పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్' చొరవతో ఈ ప్లేయర్స్ అఫ్గాన్ సరిహద్దు దాటగాలిగారు.