కరోనాపై పోరులో భాగంగా విరాళాల సేకరణకు 'చెక్‌మేట్ కొవిడ్' పేరుతో ఆన్లైన్ ప్రదర్శనలు ఇవ్వడానికి.. భారత చెస్ క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, హంపి, నిహాల్ సారిన్తో పాటు పలువురు చెస్ క్రీడాకారులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా జూన్ 13న పలువురు ప్రముఖులతో ఆనంద్ పోటీకి దిగనున్నారు. తద్వారా వచ్చిన నిధులను మహమ్మారితో పోరాడుతున్న వారికి సాయం చేయనున్నారు.
ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్.. క్రికెటర్ చాహల్‌తో పాటు రితీష్ దేశ్‌ముఖ్, ఆమిర్ ఖాన్, అర్జిత్ సింగ్, అనన్య బిర్లా, మను కుమార్ జైన్‌లతో ఆన్లైన్లో తలపడనున్నారు. ఈ విషయాన్ని యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది.
"రాబోయే ఆసక్తికరమైన మ్యాచ్‌ల కోసం ఉత్తేజంగా ఎదురుచూస్తున్నాను" అంటూ విశ్వనాథన్ ఆనంద్ కూడా ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు.