టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కరోనా పాజిటివ్‌గా తేలారు. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాహల్ తండ్రిని ఆసుపత్రిలో చేర్పించారు. తల్లికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు చాహల్ భార్య ధనశ్రీ వర్మ పేర్కొంది. ఐపీఎల్ కోసం బెంగళూరు జట్టు బయో బబుల్‌లో ఉన్న సమయంలో తన తల్లి, సోదరుడికి పాజిటివ్ వచ్చినట్లు ధనశ్రీ తెలిపింది. ఇప్పుడు వాళ్లు కోలుకున్నారని చెప్పింది.
చాహల్ తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్ - యజ్వేంద్ర చాహల్
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులకు కొవిడ్ నిర్ధరణ అయింది. తీవ్ర లక్షణాలతో ఉన్న చాహల్ తండ్రిని ఆసుపత్రిలో చేర్పించగా.. అతని తల్లికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.
యుజ్వేంద్ర చాహల్, టీమ్ఇండియా స్పిన్నర్
"అత్త, మామకు పాజిటివ్ వచ్చింది. మామయ్య ఆసుపత్రిలో ఉన్నాడు. అత్తమ్మకు ఇంట్లో చికిత్స చేయిస్తున్నాం. ఆసుపత్రికి వెళ్లినప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. అందరూ ఇళ్లలోనే ఉండండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి" అని ధనశ్రీ తెలిపింది.
ఇదీ చదవండి:ఐపీఎల్ మళ్లీ జరిపితే.. శ్రేయస్ రావడం పక్కా!