తెలంగాణ

telangana

ETV Bharat / sports

2021లో టాప్-10 వన్డే బ్యాటర్లు వీరే.. భారత్ నుంచి ఒక్కరూ లేరు! - మహ్మదుల్లా వన్డే రన్స్ 2021

Most ODI Run getters in 2021: ఈ ఏడాది ముగింపు దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.

Most ODI Runs in 2021, year enders 2021, వన్డేల్లో అత్యధిక పరుగులు, 2021 ఏడాదిలో వన్డే పరుగులు
Most ODI Runs in 2021

By

Published : Dec 19, 2021, 9:02 AM IST

Most ODI Run getters in 2021: ఈ ఏడాది ముగింపు దశకు వచ్చేసింది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు అంతా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. క్రికెట్ పరంగా చూసుకుంటే ఈ ఏడాది టీ20, టెస్టులకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాయి జట్లు. టీ20 ప్రపంచకప్, టెస్టు ప్రపంచ ఛాంపియన్ షిప్ ఉండటమే ఇందుకు కారణం. కాగా వన్డేలు మాత్రం అంతంత మాత్రంగానే జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వన్డే ఫార్మాట్​లో ఎక్కువ పరుగులు సాధించిన వారెవరో చూద్దాం. ఈ జాబితాలో ఒక్క టీమ్ఇండియా క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. భారత జట్టు ఈ ఏడాది తక్కువ వన్డే మ్యాచ్​లు ఆడటం వల్ల మన బ్యాటర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

  • పాల్ స్టెర్లింగ్

ఐర్లాండ్ సీనియర్ బ్యాటర్ పాల్ స్టెర్లింగ్ ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​గా నిలిచాడు. ఇతడు 14 ఇన్నింగ్స్​ల్లో 54.23 సగటుతో 705 పరుగులు చేశాడు.

పాల్ స్టెర్లింగ్
  • జన్నెమన్ మలన్ (దక్షిణాఫ్రికా)

అంతర్జాతీయ క్రికెట్​లోకి ఈ ఏడాది అరంగేట్రం చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ మలన్​ గొప్ప ప్రదర్శన చేశాడు. 7 ఇన్నింగ్స్​ల్లోనే 84.83 సగటుతో 509 పరుగులు చేశాడు.

మలన్
  • తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)

బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఈ ఏడాది చాలాకాలం పాటు క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. అయినా ఆడిన 14 మ్యాచ్​ల్లో 38.66 సగటుతో 464 పరుగులు సాధించాడు.

  • హారీ టెక్టార్ (ఐర్లాండ్)

ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న మరో ఐర్లాండ్ క్రికెటర్ హారీ టెక్టార్. 14 ఇన్నింగ్స్​ల్లో 454 పరుగులతో రాణించాడు.

  • ఆండ్రూ బాల్బిర్నే (ఐర్లాండ్)

ఐర్లాండ్ జట్టు కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నే ఈ ఏడాది మంచి ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా 14 ఇన్నింగ్స్​ల్లో 421 పరుగులు సాధించాడు. సగటు 32.38గా ఉంది.

  • ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్)

బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ ఈ ఏడాది 9 వన్డేల్లో 407 పరుగులు చేశాడు. సగటు 58.14గా ఉంది.

  • బాబర్ అజామ్ (పాకిస్థాన్)

పాకిస్థాన్ కెప్టెన్, రన్ మెషీన్ బాబర్ అజామ్ ఈ ఏడాది కూడా తన సత్తాచాటాడు. వన్డేల్లో 405 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం.

బాబర్ అజామ్
  • మహ్మదుల్లా (బంగ్లాదేశ్)

బంగ్లాదేశ్ స్టార్ ఆల్​రౌండర్ మహ్మదుల్లా ఈ ఏడాది 11 ఇన్నింగ్స్​ల్లో 399 పరుగులు సాధించాడు. సగటు 49.87గా ఉంది.

  • వానిందు హసరంగ (శ్రీలంక)

ఈ ఏడాది శ్రీలంక యువ ఆల్​రౌండర్ వానిందు హసరంగకు మరిచిపోలేనిదిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతడు అటు బ్యాట్​తో పాటు బంతితోనూ రాణించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 14 ఇన్నింగ్స్​ల్లో 27.38 సగటుతో 356 పరుగులు సాధించాడు.

ఇవీ చూడండి: క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ టెస్టు ఇదే.. ఏకంగా 9 రోజులు!

ABOUT THE AUTHOR

...view details