తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​కు నలుగురు స్టార్​ ప్లేయర్లు గుడ్​బై!.. WTC ఫైనల్​ అయిన వెంటనే!! - డబ్ల్యూటీసీ 2023

WTC Final 2023 : భారత క్రికెట్​ జట్టు నుంచి మరో నలుగురు స్టార్​ క్రికెటర్లు తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​​ తర్వాత వీరు రిటైర్మెంట్ ప్రకటించనున్నారట. ఆ నలుగురు ఎవరంటే?

WTC Final Retirement
WTC Final Retirement

By

Published : Jun 5, 2023, 3:45 PM IST

Updated : Jun 5, 2023, 4:00 PM IST

WTC Final 2023 : టీమ్​ఇండియాకు చెందిన నలుగురు స్టార్​ ఆటగాళ్లు త్వరలోనే తమ క్రికెట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈనెల 7 నుంచి 11 వరకు లండన్​ వేదికగా జరిగే ఆసీస్​-భారత్​ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​నే డెడ్​లైన్​గా పెట్టుకున్నారట.​ మ్యాచ్​ ముగిసిన వెంటనే ఈ నలుగురు తమ రిటైర్మెంట్​ను ప్రకటించనున్నట్లు తెలిసింది.

వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్‌షిప్​ సిరీస్​ ముగిసిన తర్వాత మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా ఆట నుంచి తప్పుకోనున్నట్లు స్పోర్ట్స్​ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్ది రోజులుగా భారత క్రికెట్​ బోర్డు యువ ఆటగాళ్లకే పెద్దపీట వేస్తోంది. ఫార్మాట్​లతో సంబంధం లేకుండా దాదాపు అన్నింటిలోనూ కొత్త ప్లేయర్లకు ఛాన్స్​ ఇచ్చేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ నలుగురు రిటైర్మెంట్​ ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

మయాంక్ అగర్వాల్:
2022 మార్చి నుంచి ఏ టెస్టు మ్యాచ్​లోనూ మయాంక్ అగర్వాల్​కు అవకాశం రాలేదు. టీమ్​ఇండియా ఓపెనర్ల స్థానం కోసం ఇప్పటికే అత్యుత్తమ ఫామ్​లో ఉన్న శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్​, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉండడం వల్ల మున్ముందు మయాంక్​కు జట్టులో చోటు లభించేలా కనిపించడం లేదు.

మయాంక్ అగర్వాల్

ఇషాంత్ శర్మ:
శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సహా మరికొంతమంది అద్భుతమైన యువ పేసర్లు భారత జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో జట్టులోకి ఇషాంత్​ రీఎంట్రీ కాస్త అనుమానంగా కనిపిస్తోంది. ఈ కారణంతో అతడు కూడా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తర్వాత తన క్రికెట్​ కెరీర్​కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇషాంత్ శర్మ

ఉమేశ్​ యాదవ్:
ప్రస్తుతం ఉమేశ్​ యాదవ్ టెస్ట్ కెరీర్ నిలకడగానే ఉంది. అయితే ఈసారి జరగబోయే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శనను ఇవ్వకపోతే మళ్లీ జట్టులోకి ఎంపిక కావడం కాస్త కష్టమే. అయితే టీమ్​లో శార్దూల్​, మహ్మద్​ సిరాజ్​ వంటి ఫాస్ట్​ బౌలర్లు ఉండడంతో ఉమేశ్​ యాదవ్​ రిటైర్​ అవుతాడనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.

ఉమేశ్​ యాదవ్

వృద్ధిమాన్ సాహా:
టెస్ట్ క్రికెట్‌ ఫార్మాట్​కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జట్టులో వృద్ధిమాన్ సాహా ప్రధాన వికెట్ కీపర్‌గా ఎదిగాడు. అయితే రిషబ్ పంత్ జట్టులోకి వచ్చిన తర్వాత అతడి స్థానాన్ని రీప్లేస్​ చేశాడు. ప్రస్తుతం కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ కూడా టీమ్​లోకి రావడంతో వృద్ధిమాన్​ సాహా రిటైర్మెంట్ దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది.

వృద్ధిమాన్ సాహా

WTC 2023 Final :క్రికెట్​ లవర్స్​తో పాటు ఆటగాళ్లు కూడా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ 2023 ఈ నెల 7 నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్​ లండన్​లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే లండన్​ చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్​లో బిజీ అయ్యారు.

Last Updated : Jun 5, 2023, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details