WTC Final 2023 IND VS AUS : టీమ్ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మొదటి రోజు ఆటలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆసీస్ జట్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146*: 22x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీ నమోదు చేశాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో శతకం బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Travis head century : అయితా తాను శతకం బాది రికార్డులు నమోదు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు ట్రావిస్ హెడ్. "ఫస్ట్ టాస్ ఓడినప్పటికీ.. ఆట పూర్తయ్యేసమయానికి ఆధిపత్యం సాధించాం. మొదట్లో కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత కుదురుకోవడంతో దూకుడుగా ఆడగలిగాను. బాగా ప్రాక్టీస్ చేయడం వల్లే ఈ ప్రదర్శన చేయగలిగాను. నా ఇన్నింగ్స్‌తో ఎంతో సంతృప్తిగా ఉన్నాను. మరో ఎండ్‌లో ఉండే బ్యాటర్ మద్దతుగా ఉంటే స్వేచ్ఛగా ఆడొచ్చు. ఇప్పుడు స్టీవ్ స్మిత్ అందించిన సహకారం మర్చిపోలేనిది. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇకోపోతే పిచ్ కూడా మొదట్లో చాలా కఠినంగా అనిపించింది"అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.
మొదటి రోజు రికార్డులు..
- గత 57 టెస్టుల్లోనూ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగిన టీమ్ఇండియా.. కేవలం 9 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో 20 టెస్టుల్లో ఓటమిని అందుకుంది. 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
- ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లోనే 81.91తో అత్యధిక బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ ఉన్న ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో ఉన్న రిషభ్ పంత్ 80.81 స్ట్రైక్‌రేట్‌ను అధిగమించాడు.
- స్టీవ్ స్మిత్ ఓ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై పర్యాటక జట్టు బ్యాటర్స్‌లో.. అత్యధిక టెస్టు పరుగులు చేసిన జాబితాలో 1822* పరుగులతో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఫలితంగా గ్యారీఫీల్డ్ సోబెర్స్‌ను(1820 పరుగులు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (2674 పరుగులు) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ఓవల్ స్టేడియంలో స్మిత్ మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 486 పరుగులను చేశాడు.
- స్మిత్-హెడ్ కలిసి నాలుగో వికెట్‌కు 251 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లాండ్‌లో నాలుగో వికెట్‌కు ఇది రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. అంతకుముందు 1934లో డాన్ బ్రాడ్‌మన్ - బిల్ పోన్స్‌ఫోర్డ్ జోడీ.. ఇంగ్లాండ్‌పై 388 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
- టీమ్ఇండియాపై ఆస్ట్రేలియాకు ఏ వికెట్‌కైనా నాలుగో అత్యధిక భాగస్వామ్యం ఇదే. 2012లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుపై పాంటింగ్ - మైకెల్ క్లార్క్ కలిసి 386 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
- డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో హెడ్-స్మిత్ కలిసి ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 99.28 యావరేజ్‌తో 695 పరుగులు నెలకొల్పారు.