ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ వేలం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ఐదు జట్లు (ముంబయి, దిల్లీ , బెంగళూరు , గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్) పాల్గొన్నాయి. పోటాపోటీగా జరిగిన బిడ్డింగ్‌లో టీమ్ఇండియా ప్లేయర్ స్మృతి మంధానను భారీ ధర రూ. 3.4 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆష్లీ గార్డనర్‌ను రూ. 3.2 కోట్లకు గుజరాత్, నాట్ స్కివర్‌ను రూ. 3.2 కోట్లకు ముంబయి, దీప్తి శర్మను రూ. 2.60 కోట్లకు యూపీ వారియర్స్, జెమీమా రోడ్రిగ్స్‌ను రూ. 2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ జట్లు దక్కించుకున్నాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు ఎంపికైన మహిళా క్రికెటర్లు వీరే.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రేసులో నిలిచిన తెలుగు ప్లేయర్లు వీళ్లే..! - డబ్ల్యూపీఎల్ 2023 తెలుగు క్రికెటర్లు
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం సోమవారం అట్టహాసంగా జరిగింది. కొందరు ప్లేయర్లను రూ. కోట్లకు ఫ్రాంచైజీలు దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. కాగా, ఈ వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు కూడా పాల్గొన్నారు.
కాగా, ఈ వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్లేయర్లు లిస్టింగ్‌లోకి వచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ కె అంజలి శర్వాణి, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఉన్నారు. అయితే, అంజలిని.. యూపీ వారియర్స్ జట్టు రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు, రూ. 10 లక్షలు బేస్ ప్రైజ్న నిర్ణయించుకున్న ఆల్‌రౌండర్ గొంగడి త్రిషకు నిరాశ ఎదురైంది. వేలం తీరును చూస్తే త్రిషకు భారీ ఎమౌంట్ వస్తుందనుకున్నారు.. కానీ త్రిషను కొనుగోలు చేయడానికి ఏ టీమ్ ఆసక్తి చూపలేదు.