WPL 2024 Auction :మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ముంబయి వేదికగా వేలం జరగనునుంది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దడానికి బీసీసీఐ ఓ కమిటీ వేసింది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహిస్తూ, టోర్నీలో పోటీతత్వాన్ని పెంచడంలో ఈ కమిటీ సహాయపడుతుందని బీసీసీఐ తెలిపింది. ఇక డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ 2024 ఫిబ్రవరి - మార్చిలో జరిగే ఛాన్స్ ఉంది.
కమిటీ మెంబర్లు..
- రోజర్ బిన్ని - బీసీసీఐ ఛైర్పర్సన్
- జై షా - కన్వీనర్
- అరుణ్ ధుమాల్ - ఐపీఎల్ ఛైర్పర్సన్
- రాజీవ్ శుక్లా - బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
- ఆశిష్ శేలర్ - బీసీసీఐ ట్రెజరరీ
- దేవజీత్ సైకియా - బీసీసీఐ జాయింట్ సెక్రటరీ
మొత్తం 165 మంది ప్లేయర్లు ఈ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. అందులో 104 మంది భారత్ ప్లేయర్లు కాగా, 61 మంది విదేశీయులు. ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. మొత్తం 30 స్లాట్లు ఖాళీగా ఉండగా, అందులో విదేశీయులకు 9 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఫ్రాంచైజీలు అత్యధికంగా 18 కంటే ఎక్కువ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వీల్లేదు. అయితే ప్లేయర్లను రిటెయిన్, రిలీజ్ చేసుకునే గడువు అక్టోబర్ 15కే ముగిసింది. ఈ క్రమంలో 2023 డబ్ల్యూపీఎల్ విన్నర్ ముంబయి ఇండియన్స్ 13 మందిని రిటెయిన్ చేసుకోగా, రన్నర్ దిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 15 మందిని అట్టిపెట్టుకుంది.
ఆయా ఫ్రాంచైజీల ఖాళీ స్లాట్, పర్స్ వ్యాల్యూ..
ఫ్రాంచైజీ | పర్స్ వాల్యూ | అందుబాటులో ఉన్న స్లాట్స్ |
దిల్లీ క్యాపిటల్స్ | రూ.2.25 | 3 |
గుజరాత్ జెయింట్స్ | రూ.5.95 కోట్లు | 10 |
ముంబై ఇండియన్స్ | రూ.2.1 కోట్లు | 5 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ.3.35 కోట్లు | 7 |
యూపీ వారియర్స్ | రూ.4 కోట్లు | 5 |