తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌.. భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌ పీసీబీ చీఫ్‌ భారత్​కు రానున్నారు. ఈ మేరకు ఓ సందేశం పంపారు. ఆ సందేశంలో ఆయన ఏం అన్నారంటే?

World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌..  భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌
World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌.. భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 7:44 PM IST

World Cup 2023 IND vs PAK : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్​ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానుండటం విశేషం. కాగా ఇప్పటికే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్​ జర్నలిస్ట్‌లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 60 మంది జర్నలిస్టులతో కలిసి జకా అష్రఫ్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. "నేను గురువారం భారత్‌కు రానున్నాను. నా జర్నీ కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్థాన్​ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. వీసాల జారీపై భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా జర్నలిస్టులతో కలిసి భారత్‌కు వస్తున్నాను. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మా టీమ్​ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్లేయర్ల ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. టీమ్​ను ప్రోత్సహించేందుకు నేను భారత్‌కు వెళ్తున్నాను. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మా జట్టుకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడండి " అని జకా అష్రఫ్ పేర్కొన్నారు.

Ind Pak Match Tickets Price : ఆకాశాన్నంటుతున్న ధరలు.. వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు చేరకోనున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. భారతీయ రైల్వే.. ఈ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లను నడపనున్నట్లు ఈ మధ్యే తెలిపింది.

ODI World Cup 2023 AFG vs IND : చరిత్ర సృష్టించిన కెప్టెన్​ రోహిత్ శర్మ.. ఆ రికార్డ్ బ్రేక్ చేసి తొలి క్రికెటర్​గా ఘనత

Hardik Pandya Birthday : ​పాండ్య దిగితే పూనకాలే.. పాక్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్!

ABOUT THE AUTHOR

...view details