తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Cup 2023 Glenn Maxwell : నెదర్లాండ్స్​తో మ్యాచ్​.. బీసీసీఐపై ఆసీస్ ఫాస్టెస్ట్​​ సెంచరీ వీరుడు గుస్సా! - ఆస్ట్రేలియా ప్లేయర్​ మ్యాక్​వెల్​ సెంచరీ

World Cup 2023 Glenn Maxwell : వరల్డ్​కప్​ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆసీస్ ప్లేయర్ గ్లెన్​ మ్యాక్స్​వెల్ బీసీసీఐపై కాస్త సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే?

World Cup 2023 Glenn Maxwell : నెదర్లాండ్స్​తో మ్యాచ్​.. బీసీసీఐపై ఆసీస్​ సెంచరీ వీరుడు గుస్సా!
World Cup 2023 Glenn Maxwell : నెదర్లాండ్స్​తో మ్యాచ్​.. బీసీసీఐపై ఆసీస్​ సెంచరీ వీరుడు గుస్సా!

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 10:50 AM IST

World Cup 2023 Glenn Maxwell : దిల్లీ వేదికగా బుధవారం నెదర్లాండ్స్​​తో జరిగిన మ్యాచ్​తో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్​ అనంతరం వరల్డ్ కప్ టోర్నీలు నిర్వహిస్తున్న బీసీసీఐపై ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మండిపడినట్లు తెలుస్తోంది. మ్యాచ్​ మధ్యలో ఆడియెన్స్ కోసం నిర్వహిస్తున్న నైట్​ క్లబ్​ లైట్​​ షో విషయంపై కోపడ్డాడు. ఆ షోను ఏర్పాటం చేయటం కన్నా మరొక చెత్త నిర్ణయం ఇంకొకటి లేదన్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచులో రికార్డులు బద్దలు కొట్టిన కాసేపటికే మ్యాక్స్​వెల్​ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసినఆస్ట్రేలియా399 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్​వెల్​ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. అనంతరం నెదర్లాండ్స్ బ్యాటింగ్ సమయంలో ఎప్పట్లాగే డ్రింక్స్ బ్రేక్‌లో లైట్ షో నిర్వహించారు. వరల్డ్ కప్​లో జరుగుతున్న ప్రతి మ్యాచులోనూ ప్రేక్షకులకు ఎంజాయ్‌మెంట్ కోసం ఈ లైట్ షో వేస్తున్నారు. అయితే ఇది ముగిసిన వెంటనే కళ్లు మూసుకొని చాలా ఇబ్బంది పడినట్లుగా మ్యాక్స్ కనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ లైట్ షోపై మండిపడ్డాడు.

'బిగ్ బాష్‌లో ఆడుతున్నప్పుడు కూడా ఒకసారి పెర్త్‌లో ఇలాగే లైట్ షో ఏర్పాటు చేశాడు. అప్పుడే నాకు బాగా తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఈ షో ముగిసిన తర్వాత కళ్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే సాధ్యమైనంతగా కళ్లు మూసుకొని ఈ లైట్స్ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ లైట్​ షో ఆడియెన్స్​కు బాగుంటుంది కానీ ప్లేయర్లకు మాత్రం నరకంగా కనిపిస్తుంది. ప్లేయర్ల విషయంలో ఇంత కన్నా చెత్త నిర్ణయం మరొకటి ఉండదు" అని మ్యాక్స్​వెల్​అన్నాడు.

కొన్ని రోజుల క్రితం టీమ్​ఇండియా - కివీస్​తో జరిగిన మ్యాచ్​లో ఇలాంటి లైట్​ షోనే నిర్వహించారు. అప్పుడు కూడా శ్రేయస్​ అయ్యర్​ దీని వల్ల ఇబ్బంది పడి ఔట్ కూడా​ అయ్యాడు! లైట్ షో ముగిసిన వెంటనే కళ్లు అడ్జస్ట్ అవ్వడానికి సమయం పట్టడం సహజమే. అయితే ఈ క్రమంలోనే పూర్తిగా కళ్లు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్లనే శ్రేయస్ అయ్యర్ ఔటై ఉంటాడని అప్పుడు కొంత మంది ఫ్యాన్స్ అన్నారు. కానీ, అయ్యర్ మాత్రం దీనిపై స్పందించలేదు. దీంతో ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ ఇలా మాట్లాడటం వల్ల అందరూ శ్రేయస్​ అయ్యర్ ఔట్​ను గుర్తుచేస్తున్నారు.

World Cup Fastest Centuries : ప్రపంచ కప్​లో సెంచరీల మోత.. ఫాస్టెస్ట్​ సెంచరీ వీరులు వీరే

Aus vs Ned World Cup 2023 : నెదర్లాండ్స్​ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా.. 309 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details