తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​కప్​ విజేతలకు ఘన స్వాగతం.. బ్యాండు మేళాలతో ఊరేగింపు

అండర్-19 వరల్డ్​ గెలిచిన అమ్మాయిలకు దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోఘన స్వాగతం పలికారు. పూల మాలలతో సత్కరించి.. బ్యాండు మేళాలతో ఊరేంగించారు. అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్లేయర్లు సందడి చేశారు.

Women s U19 World Cup winners receive rousing welcome
Women s U19 World Cup winners receive rousing welcome

By

Published : Feb 2, 2023, 5:38 PM IST

వరల్డ్​కప్​ విజేతలకు ఘన స్వాగతం.. బ్యాండు మేళాలతో ఊరేగింపు

భారత్​కు తొలి అండర్​-19 వరల్డ్​ కప్​ను అందించిన అమ్మాయిలకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్​తో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వరల్డ్​కప్​ విజేతలను పూలమాలలతో సత్కరించారు. బ్యాండు మేళాలతో అదిరిపోయే వెల్​కమ్​ చెప్పారు. అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ప్లేయర్లు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చిందులేశారు. అనంతరం ఆటగాళ్లను ఊరేగించారు. దీంతో ఎయిర్​పోర్టు ప్రాంగణం కొద్ది సేపు కోలాహలంగా మారింది.

"సచిన్​ తెందుల్కర్​తో మాట్లాడటం చాలా గొప్పగా అనిపించింది. మా కల నెరవేరింది. మొదటి సారి అండర్​-19 వరల్డ్​కప్ గెలవడం మాకు చాలా పెద్ద విషయం. ఇప్పుడు జట్టు మొత్తం ఆనందంగా ఉంది. మేము మహిళా వరల్డ్​కప్​ కోసం ఎందురు చూస్తున్నాం."

-- అండర్​-19 వరల్డ్​కప్​ గెలిచిన జట్టు

కాగా, ఈ వరల్డ్​కప్​ విజేతలను ఇంతకుముందు బీసీసీఐ సత్కరించింది. బుధవారం అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శ జై షా, టీమ్​ఇండియా మాజీ దిగ్గజం సచిన్​ తెందుల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పాల్గొన్నారు. వరల్డ్ కప్​ గెలిచిన టీమ్​, సపోర్ట్​ స్టాఫ్​కు బీసీసీఐ ప్రకటించిన రూ. 5 కోట్ల ప్రైజ్​మనీని కెప్టెన్​ శెఫాలీ వర్మ అందుకుంది. ఈ సందర్భంగా సచిన్ తెందుల్కర్​ మాట్లాడుతూ.. "ఈ ప్రపంచకప్ గెలవడం ద్వారా, మీరు భారతదేశంలోని అమ్మాయిలకు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కోరికను కలిగించారు. మహిళల​ ఐపీఎల్​ ప్రారంభం కావడం చాలా పెద్ద విషయం. క్రీడల్లోనే కాకుండా.. పురుషులు, మహిళల సమానత్వాన్ని నేను కోరుకుంటాను. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉండాలి" అని సచిన్ తెందుల్కర్ అన్నారు.
ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. ఇంగ్లాడ్​ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో ఛేదించి.. టీమ్ఇండియా తొలి వరల్డ్​కప్​ను ముద్దాడింది. మొదట బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అనంతరం బరిలోకి దిగిన టీమ్​ఇండియా బ్యాటర్లు గొంగడి త్రిష, సౌమ్య తివారీ అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టును విజయ తీరాలకు నడిపించారు.

ABOUT THE AUTHOR

...view details