తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 2:32 PM IST

Updated : Dec 2, 2023, 2:52 PM IST

ETV Bharat / sports

వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ వేలం- 165 మందిలో అదృష్టం వరించేది​ ఎవరినో?

Womens Premier League 2024 Auction : మహిళల ప్రీమియర్ లీగ్​ వేలానికి మరో వారం రోజుల సమయం ఉండటం వల్ల ప్లేయర్ల ఎంపికపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలో 165 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారని బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Womens Premier League 2024 Auction
Womens Premier League 2024 Auction

Womens Premier League 2024 Auction : మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్​ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ టోర్నీ రెండో ఎడిషన్ వేలానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో ఐదు ఫ్రాంచైజీలు క్రికెటర్ల ఎంపికపై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ముంబయి వేదికగా ఈ నెల 9న‌ జ‌రిగే డబ్ల్యూపీఎల్ వేలంలో 165 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. అందులో 104 మంది భారతీయులు, 61 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక 15 మంది అసోసియేట్​ దేశాల ప్లేయర్లు ఉన్నారు. ఈ 165 ప్లేయర్లలో 56 మంది ​క్యాప్డ్, 109 మంది అన్​క్యాప్డ్​ ప్లేయర్లు ఉన్నారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ ​శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఐదు టీమ్​లలో 30 స్లాట్లు మాత్రమే ఉండగా అందులో విదేశీ ప్లేయర్లకు 9 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్​ ఆడే అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆసక్తి నెలకొంది.

అయితే అత్యధిక కనీస ధర రూ.50 లక్షలతో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ డియాండ్ర‌ డాటిన్, ఆస్ట్రేలియా ప్లేయర్ కిమ్ గార్త్ తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక రూ.40 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు ఆసీస్ ఆల్‌రౌండ‌ర్లు అనాబెల్ స‌థ‌ర్‌లాండ్, జార్జియా వ‌రేహం, సౌతాఫ్రికా బౌలర్ ష‌బ్నిం ఇస్మాయిల్, ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ అమీ జోన్స్ తమ పేర్లను వేలంలో నమోదు చేసుకున్నారు. ఇక మిగతా ప్లేయర్లు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.

ఐదు ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్​ విలువ, స్లాట్ల వివరాలు :

దిల్లీ క్యాపిటల్స్

  • పర్స్​ వాల్యూ - రూ.2.25కోట్లు
  • మిగిలిన స్లాట్లు - 3
  • విదేశీ స్లాట్లు - 1

గుజరాత్ జెయింట్స్

  • పర్స్​ వాల్యూ - రూ.5.95 కోట్లు
  • మిగిలిన స్లాట్లు - 10
  • విదేశీ స్లాట్లు - 3

ముంబయి ఇండియన్స్

  • పర్స్​ వాల్యూ - రూ.2.1 కోట్లు
  • మిగిలిన స్లాట్లు - 5
  • విదేశీ స్లాట్లు - 1

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు

  • పర్స్​ వాల్యూ - రూ.3.35కోట్లు
  • మిగిలిన స్లాట్లు - 7
  • విదేశీ స్లాట్లు - 3

యూపీ వారియర్స్

  • పర్స్​ వాల్యూ - రూ.4 కోట్లు
  • మిగిలిన స్లాట్లు - 5
  • విదేశీ స్లాట్లు - 1

సొంత గడ్డపై ఇంగ్లాండ్​తో పోరు - హర్మన్‌ప్రీత్‌కు పగ్గాలు

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్​- న్యూజిలాండ్​పై 150 పరుగుల తేడాతో ఘన విజయం

Last Updated : Dec 2, 2023, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details