తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్యాన్​కు రోహిత్​ పెళ్లి ప్రపోజల్​.. రోజా పువ్వు ఇచ్చి మరీ!

వైజాగ్​ ఎయిర్​పోర్ట్​లో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ఓ ఫ్యాన్​కు ప్రపోజ్​ చేశాడు. గులాబీ పువ్వు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుత్తం నెట్టింట వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే?

By

Published : Mar 20, 2023, 2:32 PM IST

rohit sharma
rohit sharma

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఎప్పుడూ అభిమానులతో సరదాగా ఉంటాడు. ప్రతీసారి వారిపై తన ప్రేమను చూపిస్తాడు. ఇలాంటి ఘటనే వైజాగ్‌లో జరిగిది. ఓ అభిమానికి హిట్‌మ్యాన్‌ సరదాగా ప్రేమ ప్రతిపాదన చేశాడు. పువ్వు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటావా..? అని అడిగాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.అసలేం జరిగిందంటే?

తొలి వన్డేకు వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేని రోహిత్‌ శర్మ.. రెండో వన్డేకు జట్టుతో చేరాడు. జట్టు సభ్యులతో కలిసి వైజాగ్‌ విమానాశ్రయంలో దిగాడు. ఆటగాళ్లంతా బయటకు వస్తుండగా.. ఓ అభిమాని వారిని ఫాలో అవుతూ.. ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీశాడు. ఇంతలో అతడి వద్దకు రోహిత్‌ వచ్చి.. తన వద్ద ఉన్న గులాబీని ఇచ్చాడు. 'తీసుకో.. ఇది నీ కోసమే.. నన్ను పెళ్లి చేసుకుంటావా..' అని సరదాగా అడిగాడు. రోహిత్‌ తనను పలకరించినందుకు సంతోషించిన ఆ అభిమాని.. ఆ ప్రపోజల్‌కు మాత్రం కాస్త షాక్‌ అయినట్లు కనిపించాడు.

కాగా, విశాఖ వన్డేలో టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు ఆసీస్‌ బౌలర్ల ధాటికి 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్‌కోహ్లీ 31 పరుగులు చేయగా.. అక్షర్‌ పటేల్‌ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 5 వికెట్లతో సత్తా చాటాడు. సీన్‌ అబాట్‌కు 3, నాథన్ ఎల్లిస్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ 66, ట్రావిస్‌ హెడ్‌ 51 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ఆస్ట్రేలియా సమం చేసింది. బుధవారం చెన్నైలో జరిగే మూడోవన్డే నిర్ణయాత్మకంగా మారింది.

బ్యాటింగ్​లోనూ బౌలింగ్​లోనూ ఫైర్​..
ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా ఆసిస్​ టీమ్​ తమ ఓపెనర్లతోనే ఆటను ముగించింది. వైజాగ్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో అనూహ్య మార్పు జరిగింది. కేవలం 11 ఓవర్లలోనే 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఆసిస్​ టీమ్​. దీంతో విజయం ఆసిస్ టీమ్​ను వరించింది. ఓపెనర్లుగా దిగిన ట్రావిస్​ హెడ్​, మిచెల్​ మార్ష్​ బరిలోకి దిగగా వారికి షమీ బౌలింగ్​ వేశాడు. అయితే తొలి రెండు ఓవర్లకే 13 పరుగులు ఇచ్చేశాడు. దీంతో కంగారు జట్టు చెలరేగిపోయింది. ఇక ట్రావిస్​, మిచెల్​ పోటీ పడి మరీ బాల్​ను బాదేశారు. కేవలం ఆరు ఓవర్లలోనే ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా 66 పరుగులను సాధించారు. మిచెల్​ మార్ష్, ట్రావిస్​ అర్థ శతకాన్ని స్కోర్​ చేసి సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ (51*), (66*) స్కోర్లతో పని పూర్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

rohit sharma

ABOUT THE AUTHOR

...view details