తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: మినీ వేలంలోకి కామెరూన్ గ్రీన్!​.. ఆసీస్ కెప్టెన్ ఏమన్నాడంటే?

ఆసీస్ ఆల్​రౌండర్​ కామెరూన్ గ్రీన్​పై ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్​.. ఐపీఎల్​లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కమిన్స్ చెప్పాడు . తమ ఆటగాళ్లకు ఐపీఎల్​ ఆడే అవకాశం వస్తే వదులుకోవాలని చెప్పలేనని అన్నాడు.

Cameron
కామెరూన్‌ గ్రీన్‌

By

Published : Nov 19, 2022, 7:01 AM IST

ఆసీస్‌ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ రానున్న భారత టీ20 లీగ్‌లో పాల్గొనడంలేదని ప్రకటించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో తీరిక లేకుండా గడుపుతుండటమే ఇందుకు కారణంగా వెల్లడించాడు. అయితే తమ జట్టు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను మాత్రం ఈ ఆటకు దూరం చేయడం లేదని తాజాగా తెలిపాడు. తాను జట్టు కెప్టెన్‌ అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు అలాంటి అవకాశాన్ని వదులుకోవాలని చెప్పలేనంటూ పేర్కొన్నాడు.

గత సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడు తన పేస్‌ బౌలింగ్‌, చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో రానున్న టీ20 లీగ్‌ వేలంలోకి రావాలని గ్రీన్‌ భావిస్తే అతడి కోసం భారీగా బిడ్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిన్స్‌ స్పందిస్తూ.. "అవును.. భారత టీ20 లీగ్‌ వేలంలోకి గ్రీన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి చూద్దాం. ఒక జట్టు కెప్టెన్‌గా నేను కొంత స్వార్థంగా ఆలోచిస్తే.. ఆటగాళ్ల శక్తినంతా దేశం కోసం ఆడేందుకే ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. కానీ అటువంటి గొప్ప అవకాశాన్ని వదులుకోవాలని ఎవరికైనా మనం ఎలా సూచించగలం?" అంటూ కమిన్స్‌ వివరించాడు.

ABOUT THE AUTHOR

...view details