తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS PAK : భారత్​-పాక్ ఫైనల్​కు అంతా రెడీ​.. మన కుర్రాళ్లు ఏం చేస్తారో? - ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌

IND VS PAK Asia Cup emerging final : మరి కొన్ని గంటల్లో టీమ్ఇండియా పాకిస్థాన్ మధ్య ఫైనల్​ మ్యాచ్ జరగనుంది. ఆ వివరాలు..

IND VS PAK
IND VS PAK : ఫైనల్​లో భారత్​-పాక్ మ్యాచ్​.. మన కుర్రాళ్లు ఏం చేస్తారో?

By

Published : Jul 23, 2023, 11:27 AM IST

Updated : Jul 23, 2023, 11:33 AM IST

IND A VS PAK A Asia Cup emerging final : క్రికెట్‌ అభిమానులకు మస్త మజా ఇచ్చే మ్యాచులు జరుగుతున్నాయి. ఈరోజైతే(జులై 23) వారికి పండగనే చెప్పాలి. ఇప్పటికే వెస్టిండీస్​-టీమ్​ఇండియా రెండో టెస్టు, యాషెస్‌ సిరీస్‌ ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా నాలుగో టెస్టు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ రెండింటితో పాటు మరో ఆసక్తికర పోరు కూడా జరగనుంది. అదే భారత్, పాకిస్థాన్ యంగ్ టీమ్స్​ మధ్య ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌. లీగ్​ స్టేజ్​లో పాకిస్థాన్ జట్టును మట్టికరిపించిన భారత్​.. ఇప్పుడు ఫైనల్​లో ఆ జట్టుతోనే తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్​ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారమవుతుంది. శ్రీలంక కొలొంబో వేదికగా మ్యాచ్‌ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఇది ప్రారంభం అవుతుంది.

ఈ మినీ టోర్నీలో భారత్​.. ఓటమనే పదానికి చోటు లేకుండా ఫైనల్​కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజీలో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ దూసుకెళ్లన ఆ జట్టు.. అదే గ్రూప్​ స్థాయిలో పాకిస్థాన్​ జట్టును చిత్తుచేసింది. సెమీస్​లో మాత్రం కాస్త తడబడినట్టు కనిపించినా... బంగ్లాదేశ్​ను ఓడించేసింది. తుది పోరుకు అర్హత సాధించింది. అయితే ఈ ఫైనల్​లో.. మళ్లీ పాక్​తో తలపడనుంది భారత్​. ఇక్కడ కూడా మన ప్లేయర్లు అదే జోరును కొనసాగిస్తూ.. కప్​ను ముద్దాడాలని ఆశిస్తున్నారు.

ఫుల్ ఫామ్​లో.. ప్రస్తుతం టీమ్​ఇండియా యంగ్ టీమ్ కెప్టెన్​ యశ్‌ ధుల్‌తో పాటు ఓపెనర్‌ సాయి సుదర్శన్ సూపర్​ ఫామ్‌లో ఉన్నారు. లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్​పై సాయి 104 సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక ఆసియా కప్‌ మొదటి మ్యాచ్‌లోనే యూఏఈ టీమ్​పై యశ్‌ ధుల్‌ కూడా 108 సెంచరీతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో టీమ్​కు తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఫైనల్‌లోనూ వీరు ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. భారత్ జట్టు గెలవడం పెద్ద కష్టమేమి కాదు.

బౌలర్లు కొనసాగించాలి.. ఇకపోతే.. ఈ ఎమర్జింగ్ ఆసియా కప్‌ టోర్నీలో.. ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్​లో ఉంది భారత ప్లేయరే నిశాంత్ సింధు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. సెమీస్‌లోనూ బంగ్లాదేశ్​ను చిత్తు చేయడంలో అతడితే కీలక పాత్ర. 5/20.. ఆ జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు. ఇక మానవ్‌ సంధు 9 వికెట్ల తీసి రెండో స్థానంలో నిలిచాడు. లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్​పై రాజ్‌వర్థన్‌ హంగార్గేకర్ (5/42) ప్రదర్శన చేశాడు. అతడు మూడు మ్యాచుల్లోనే 8 వికెట్లను పడగొట్టాడు. ఇంకా హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి, రియాన్‌ పరాగ్‌ కూడా కాస్త మద్దతుగా నిలిస్తే.. జట్టుకు తిరుగండదు.

పాక్‌ తక్కువేం కాదు.. ఇకపోతే పాకిస్థాన్​ జట్టు తక్కువేమి కాదు. లీగ్‌ స్టేజ్‌లో భారత్​పై ఓడిపోయినప్పటికీ.. సెమీస్‌లో శ్రీలంకపై మంచిగా రాణించింది. ఘన విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌ మహ్మద్‌ హారిస్‌, ఓపెనర్‌ ఫర్హాన్‌, ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ వసీమ్‌, పేసర్లు మహమ్మద్‌ వాసిమ్‌ జూనియర్‌, అర్షద్‌ ఇక్బాల్‌లతోలా జట్టు బలంగానే కనిపిస్తోంది. అసలే పాక్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మంచిగా రాణించిన అమద్‌ బట్‌, ఒమర్‌ యూసుఫ్‌లతో.. మనోళ్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందే.

ఇదీ చూడండి :

IND VS WI 2023 : పోరాడుతున్న విండీస్‌.. వందో టెస్ట్ డ్రాగా ముగిస్తారా?

కోపంతో ఊగిపోయిన హర్మన్ ప్రీత్ కౌర్.. అవమానించారంటూ..

Last Updated : Jul 23, 2023, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details