తెలంగాణ

telangana

ETV Bharat / sports

జింబాబ్వే సూపర్​ విక్టరీ.. ఒక్క ట్వీట్​తో పాక్ గాలి తీసిన ఆ దేశ అధ్యక్షుడు! - జింబాబ్వే అధ్యక్షుడు ట్వీట్​

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించింది. అయితే మ్యాచ్​ అనంతరం రియల్ మిస్టర్ బీన్‌ను పంపించాలంటూ జింబాబ్వే అధ్యక్షుడు ట్వీట్ చేశారు. అసలు రియల్​ బీన్​ను పంపడమేంటి? దీని వెనుక ఉన్న కథేంటి?

zimbabwe
zimbabwe

By

Published : Oct 28, 2022, 10:45 AM IST

Updated : Oct 28, 2022, 11:08 AM IST

T20 World Cup Pak VS Zim: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో చిన్న జట్లు పంజా విసురుతున్నాయి. మొన్నటికి మొన్న ఐర్లాండ్ తన కంటే ఎంతో బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలోనే అయినప్పటికీ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి.. ఆ లక్ష్యానికి ఆమడదూరంలో ఇంగ్లాండ్‌ను ఉంచగలిగింది ఐర్లాండ్. వీటి దెబ్బకు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ కనీసం సూపర్ 12లో అడుగు కూడా పెట్టలేకపోయింది.

జింబాబ్వే దెబ్బకు..
అక్కడితో వాటికి బ్రేక్ పడలేదు. పాకిస్థాన్​ జట్టు సైతం ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. జింబాబ్వే చేతిలో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని ఛేదించలేక పాక్​ జట్టు చతికిలపడింది. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా రెండింటితోనే సరిపెట్టుకుంది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా పాకిస్థాన్​కు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

పెను సంచలనం..
పాకిస్థాన్​పై జింబాబ్వే సాధించిన ఈ విజయం క్రికెట్ ప్రపంచంలో పెనుసంచలనంగా మారింది. 130 పరుగులను కాపాడుకోవడంలో జింబాబ్వే ప్లేయర్లు చూపించిన తెగువను ప్రశంసించకుండా ఉండలేకపోతోన్నారందరూ. ఓడింది పాకిస్థాన్​ కావడంతో ఇటు భారత్‌లోనూ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. జింబాబ్వే జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.

ఫేక్ మిస్టర్ బీన్
ఈ మ్యాచ్ అనంతరం టాప్ కమెడియన్ మిస్టర్ బీన్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మిస్టర్ బీన్ పదాన్ని స్వయంగా జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో సైతం ఉపయోగించాల్సి వచ్చిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం లేకపోలేదు.

రోడ్‌షోలో..
2016లో జింబాబ్వే రాజధాని హారారెలోని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించిన ఓ కామెడీ షో సందర్భంగా ఆ దేశ ప్రజలను అవమానపరిచింది పాకిస్థాన్. హారారె రోడ్‌షోలో మిస్టర్ బీన్ బదులుగా ఆయన రూపాన్ని పోలిన పాకిస్థాన్ కమెడియన్ ఆసిఫ్ మహ్మద్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడ్నే రియల్ మిస్టర్ బీన్ అనుకున్నారు జింబాబ్వే ప్రజలు. అతడితో చేతులు కలపడానికి, ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. దీనికోసం పది డాలర్లు చెల్లించారు. ఆ తరువాత నిజం తెలిసి లబోదిబోమన్నారు.

రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ..
ఇప్పుడు ఈ విజయంతో దీనికి ప్రతీకారాన్ని జింబాబ్వేకు తీర్చుకున్నట్టయింది. నెక్స్ట్ టైమ్‌ రియల్ మిస్టర్ బీన్‌ను పంపించాలంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. తమదేశం సాధించిన విజయం పట్ల ఆయన స్పందించారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు.

ఇవీ చదవండి:'టీమ్‌ఇండియాలో రోహిత్‌, కోహ్లీ కన్నా అతడు చాలా డేంజర్​'

'వాళ్లకు ఆ ఇద్దరు పేసర్లుంటే మాకు విరాట్‌ భాయ్‌ ఉన్నాడుగా!'

Last Updated : Oct 28, 2022, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details