టీమ్ఇండియా సారథి కోహ్లీ(kohli england tour 2021) అసహనానికి గురయ్యాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. అయితే క్రీజులో కుదురుకుని అద్భుతమైన షాట్లు ఆడిన కెప్టెన్ కోహ్లీ ఈ సారి సెంచరీ కొడతారని అభిమానులు మళ్లీ ఆశించారు. కానీ విరాట్ 44 పరుగులు వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ లైన్ మీద పడిన బంతిని పుష్ చేయగా.. ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న ఓవర్టన్ చేతిలోకి వెళ్లింది.
ఈ క్రమంలోనే ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ కోహ్లీ(Kohli england series) ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడు. తనపై తానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నాడు. తీవ్ర అసహనంతో కనిపించాడతడు. బలంగా గోడను బాదుకుంటూ.. హెల్మెట్‌ను పక్కకు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.