టీమ్‌ఇండియా మాజీ కోచ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(Kumble 10 Wickets) ఆదివారం 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి(Anil Kumble Birthday) సన్నిహితుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు బీసీసీఐ సైతం ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది.
'403 అంతర్జాతీయ మ్యాచ్‌లు 956 వికెట్లు తీయడమే కాకుండా టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా టీమ్‌ఇండియా మాజీ సారథి అనిల్ కుంబ్లే నిలిచాడు. ఆ దిగ్గజానికి హ్యాపీ బర్త్‌డే' అంటూ 1999లో పాకిస్థాన్‌పై దిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన వీడియోను అభిమానులతో పంచుకుంది బీసీసీఐ. టెస్టు క్రికెట్‌లో జిమ్ లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా కుంబ్లే(Kumble Test Wickets) చరిత్ర సృష్టించాడు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (67), సందగొప్పన్ రమేశ్ (60) అర్ధశతకాలతో రాణించారు. ఆపై పాకిస్థాన్ 172 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 80 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. షాహిద్ అఫ్రిది (32) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రమేశ్ (96), సౌరభ్ గంగూలీ (62) అర్ధశతకాలతో మెరవగా భారత్ 339 పరుగులు చేసింది. అనంతరం పాక్ 419 పరుగుల లక్ష్య ఛేదనలో 207 పరుగులకు ఆలౌటైంది. అన్ని వికెట్లు కుంబ్లే(Anil Kumble vs Pakistan) తీయడం విశేషం. చివరికి భారత్ 212 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మీరూ నాటి కుంబ్లే పది వికెట్ల ప్రదర్శన చూసి ఆస్వాదించండి.
ఇదీ చదవండి:
పాక్‌పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు