తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్ బ్యాగ్ చోరీ- తిరిగివ్వాలని రిక్వెస్ట్- అందులో ఏముందంటే? - వార్నర్ గ్రీన్ క్యాప్

Warner Bag Stolen: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ పర్సనల్ బ్యాగ్ చోరికి గురైంది. అయితే ఆ బ్యాగ్​లో తనకు విలువైన వస్తువులన్నాయని, ఎవరైనా తీస్తే తిరిగి ఇచ్చేయాలని వార్నర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

Warner Bag Stolen
Warner Bag Stolen

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 11:30 AM IST

Updated : Jan 2, 2024, 12:04 PM IST

Warner Bag Stolen:ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్​తో చివరి టెస్టు కోసం మెల్​బోర్న్​ నుంచి సిడ్నీ వెళ్తుండగా అతడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్​లో గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఇచ్చేది), తన పిల్లల విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ అన్నాడు. అయితే ఆ బ్యాగ్ ఎవరు తీసినా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా కోరాడు.

'అందరికీ హాయ్! పాక్​తో మూడో టెస్టు కోసం కొన్ని రోజుల క్రితం మెల్​బోర్న్ నుంచి సిడ్నీకి వస్తుండగా నా బ్యాగ్ పోయింది. మా లగేజ్ ఎవ్వరూ ఓపెన్ చేసినట్లు సీసీ కెమెరాల్లో ఎక్కడా లేదని క్వాంటస్ (విమానం కంపెనీ) తెలిపింది. అయితే క్వాంటస్​లో లేదా సిడ్నీ ఎయిర్​పోర్టులో పనిచేసే వారు ఎవరైనా నా బ్యాగ్ తీసుకుంటే, దయచేసి తిరిగి ఇచ్చేయండి. మీకు బ్యాగ్ కావాలంటే అలాంటిదే నా దగ్గర ఇంకోటి ఉంది. అది ఇస్తాను. మీపై ఎలాంటి యాక్షన్ తీసుకోను. వీలైనంత తొందరగా ఇవ్వండి' అని వార్నర్ వీడియో పోస్ట్ చేశాడు.

అసలేంటీ గ్రీన్ క్యాప్: ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎవరైనా జాతీయ జట్టుకు టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు, కిట్​లో భాగంగా గ్రీన్ కలర్ క్యాప్ ఇస్తారు. అది వారికి ఒక గౌరవంగా ఎప్పటికీ ఉండిపోతుంది.

Warner Test Retirement: వార్నర్ ఇప్పటికే టెస్టు కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించగా, రీసెంట్​గా వన్డేలకూ గుడ్​ బై చెప్పాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటి వరకు 111 మ్యాచ్​లు ఆడాడు. 203 ఇన్నింగ్స్​ల్లో వార్నర్ 44.59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఈ సిరీస్​తో వార్నర్ టెస్టు కెరీర్ ముగియనుంది.

Aus Vs Pak 3rd Test:ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జనవరి 3న మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్​ల్లో నెగ్గి ఇప్పటికే సిరీస్ చేజిక్కిచ్చుకున్న ఆసీస్ క్లీన్​స్వీప్​పై కన్నేసింది. మరోవైపు ఈ మ్యాచ్​లో నెగ్గి విజయంతో పర్యటనను ముగించాలని పాక్ భావిస్తోంది.

వన్డేలకు 'వార్నర్' గుడ్​బై- అవసరమైతే ఆ టోర్నీలో ఆడతాడట!

2023 బెస్ట్​ ఐకానిక్ మూమెంట్స్​- 'విరాట్' 50వ సెంచరీయే హైలైట్

Last Updated : Jan 2, 2024, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details