Vrinda Ghanshyam Rathi Test Cricket Umpire :భారత మహిళా క్రికెట్ అంపైర్ వృందా ఘనశ్యామ్ రాఠీ అరుదైన ఘనతం సాధించింది. భారత తొలి మహిళా టెస్ట్ అంపైర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టుతో టీ20 జరుగుతున్న సందర్భంగా ఈ కొత్త కోచ్‌ను మేనేజ్మెంట్ పరిచయం చేసింది.
2014లో ముంబయి క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది వృంద. ఆ తర్వాత 2018లో బీసీసీఐ నిర్వహించిన పరీక్షలోనూ పాస్ అయ్యింది. ఇక 2020లో ఐసీసీ డెవలప్‌మెంట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్‌లుకు ఆమె ప్రమోషన్ పొందింది. 2022లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రాఠీ అంపైర్‌గా వ్యవహరించింది. అంతే కాకుండా ఈ ఏడాది చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లోనూ అంపైర్‌గా వ్యవహరించింది.
వృందా రాఠీ ఇప్పటివరకు 13 మహిళా వన్డే మ్యాచ్‌లు, 43 మహిళా టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసింది. మీడియం పేసర్ అయిన వృంద తన కాలేజీ రోజుల్లో నాలుగేళ్లపాటు ముంబయి యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో వృందా రాఠీతో పాటు కేఎన్ అనంతపద్మనాభన్ (ఇండియా) సెకండ్ ఫీల్డ్అంపైర్గా ఉన్నారు. వీరేంద్ర శర్మ థర్డ్ అంపైర్, జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు.