టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని(Ms Dhoni) టీ20 ప్రపంచకప్ టోర్నీకు(T20 World Cup 2021) మెంటార్‌గా నియమించడం మంచి నిర్ణయమని, అది బౌలింగ్ బృందానికి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన వీరు అనేక విషయాలపై స్పందించాడు.
మహీ మళ్లీ రావాలని ఉంది..
"టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ మెంటార్‌గా(Ms Dhoni as Mentor) ఉండాలనే ప్రతిపాదనను మహీ అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతడు మళ్లీ భారత క్రికెట్‌లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే జట్టు మెంటార్‌గా ఎంపికవ్వడం గొప్ప విషయం. ఒక సారథిగా ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్పై(MS Dhoni Fielding) అతడికి అత్యద్భుత అవగాహన ఉంది. దీంతో రాబోయే ప్రపంచకప్‌లో బౌలర్లకు కలిసివస్తుంది. ప్రత్యర్థులపై సరైన ప్రణాళికలు రూపొందించడానికి ధోనీ సలహాలు, సూచనలు ఉపయోగించుకోవచ్చు" అని వీరూ వివరించాడు.
అలాగే ప్రతి అంతర్జాతీయ జట్టులోనూ పలువురు మొహమాట పడే ఆటగాళ్లు ఉంటారని, అలాంటి వాళ్లు కెప్టెన్ల(MS Dhoni as Captain) దగ్గరకు వెళ్లి నేరుగా ఏ విషయాలు మాట్లాడలేరని వీరూ పేర్కొన్నాడు. అయితే, ధోనీతో ఎవరైనా మాట్లాడగలరని, యువకులకు తగిన సలహాలు, సూచనలు చేస్తాడని చెప్పాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఇప్పటికే 15 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిందని, అయితే.. అక్టోబర్ 10 వరకు జట్టు కూర్పులో మార్పులు చేసుకునే వీలుందన్నాడు. దీంతో రాబోయే ఐపీఎల్(IPL 2021) సీజన్‌లో ఎవరైనా ఆకట్టుకుంటే జట్టులో చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అలా ఎవరైనా టీమ్‌ఇండియాకు ఎంపికైనా తాను ఆశర్చపోనని అన్నాడు.