తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై.. గంగూలీ ఏమన్నారంటే?

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(virat kohli steps down as indian captain). దీనిపై స్పందించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఉపాధ్యక్షుడు జైషా.

Virat Kohli
కోహ్లీ

By

Published : Sep 16, 2021, 8:33 PM IST

టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(virat kohli steps down as indian captain) తప్పుకోనున్నాడు. టీ20 ప్రపంచ కప్‌(t20 world cup 2021 india team) తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. ఇకపై టెస్టు, వన్డే సారథ్య బాధ్యతలపై ఎక్కువగా దృష్టిపెడతానని వెల్లడించాడు. అతడి అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాక్​కు గురయ్యారు. మాజీలు, బోర్డు అధికారులు మాత్రం కోహ్లీ(virat kohli news) నిర్ణయాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(ganguly on kohli captaincy), ఉపాధ్యక్షుడు జై షా కూడా విరాట్​ తప్పుకోవడం పట్ల స్పందించారు.

"కోహ్లీ(ganguly on kohli captaincy) ఎంతో ఆత్మవిశ్వాసంతో భారత జట్టును ముందుకు నడిపించాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా విజయవంతమయ్యాడు. భవిష్యత్​ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్​గా అతడు అందించిన సేవలకు ధన్యవాదాలు. వచ్చే ప్రపంచకప్​లోనూ సక్సెక్ కావాలని ఆశిస్తున్నాం. అలాగే భారత జట్టు తరఫున అతడు పరుగుల వరద పారించాలని కోరుకుంటున్నాం."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"భారత జట్టు భవిష్యత్ ప్రణాళికపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం. పని భారంపై చాలాకాలంగా కోహ్లీతో దీని గురించి చర్చించాం. టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నాడు. ఆరు నెలల నుంచి కోహ్లీతో పాటు యాజమాన్యంతోనూ ఈ విషయమై చర్చిస్తున్నాం. ఓ ఆటగాడిగా జట్టుకు అతడు మరిన్ని సేవలు అందిస్తాడు. అలాగే భారత జట్టు రూపురేఖల్ని మార్చడంలో సహాయపడతాడని భావిస్తున్నా" అని తెలిపాడు బీసీసీఐ ఉపాధ్యక్షుడు జైషా.

వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​లో భారత్​ను ముందుండి నడిపించనున్నాడు కోహ్లీ. ఈ టోర్నీలో గెలిచి కెప్టెన్​గా కోహ్లీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని జట్టు భావిస్తోంది.

ఇవీ చూడండి: కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details