తెలంగాణ

telangana

ETV Bharat / sports

మేనేజ్​మెంట్​కు మాజీ క్రికెటర్ ప్రశ్న - 'టెస్టు జట్టుకు విరాట్ ఎందుకు నాయకత్వం వహించడం లేదు?'

Virat Kohli Test Captaincy : ఇటీవలే జరిగిన టెస్ట్ సిరీస్​లో విరాట్​ కోహ్లీ పర్ఫామెన్స్ అద్భుతమంటూ క్రికెట్​ లవర్స్​తో పాటు మూజీలు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ బద్రినాథ్ భారత టెస్టు జట్టు సారథిగా రోహిత్‌కు బదులు విరాట్ కోహ్లీనే ఉండాలని, సుదీర్ఘ ఫార్మాట్‌లో స్టార్‌ బ్యాటర్‌కు మంచి రికార్డు ఉందంటూ అభిప్రాయపడ్డాడు. ఆ విశేషాలు మీ కోసం

Virat Kohli Test Captaincy
Virat Kohli Test Captaincy

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 5:38 PM IST

Virat Kohli Test Captaincy :గతేడాది ప్రారంభంలో టెస్టు కెప్టెన్సీని వదిలేసిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మేటి బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. టీమ్​కు అండగా నిలుస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి స్కోర్​ సాధించి జట్టుకు సహకారం అందిచాడు. దీంతో అటు విరాట్ ఫ్యాన్స్​తో పాటు మాజీలు ఈ రన్నింగ్ మెషిన్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో విరాట్​ టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ వైదొలగడం సరికాదన్న అభిప్రాయాన్ని భారత మాజీ క్రికెటర్ బద్రినాథ్ తాజాగా వెల్లడించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో సూపర్​ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్ నాయకత్వంలోనూ కొనసాగితే బాగుంటుండేదని అసలు ఎందుకు అతడు వైదొలగాల్సి వచ్చిందంటూ బద్రినాథ్ ప్రశ్నించాడు.

" టెస్టు టీమ్​ కెప్టెన్​గా విరాట్ కోహ్లీ రికార్డును చూస్తే అద్భుతం. దాదాపు 5 వేలకు పైగా పరుగులను 52 సగటుతో విరాట్ సాధించాడు. మొత్తం 68 టెస్టులకు నాయకత్వం వహించగా, అందులో 40 విజయాలను నమోదు చేశాడు. మరో 17 మ్యాచుల్లో మాత్రమే జట్టు ఓడింది. ఆసీస్‌పై అద్భుతమైన విజయాలు కూడా ఈ గణాంకాల్లో ఉన్నాయి. గ్రేమ్‌ స్మిత్‌, రికీ పాంటింగ్‌, స్టీవ్‌ వా తర్వాత అత్యధిక టెస్టు విజయాలను సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీనే. అలాంటి విరాట్ కెప్టెన్సీని వదిలేయడం సరికాదని నా అభిప్రాయం. టెస్టుల్లో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్. నైపుణ్యపరంగానూ కోహ్లీనే బెటర్. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్ శర్మ విదేశీ గడ్డపై ఓపెనర్‌గా విఫలం కావడం కూడా ఆందోళనపరిచే అంశమే. భారత్‌లో అదరగొట్టే రోహిత్ ఓవర్సీస్‌ పిచ్‌లపై మాత్రం తనని తాను నిరూపించుకోలేకపోతున్నాడు. అలాంటప్పుడు అతడిపై అదనంగా కెప్టెన్సీ భారం మోపడం తగదని నేను అనుకుంటున్నాను. టెస్టుల్లో రోహిత్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప ఫామ్​ను కనబరుస్తున్నాడు. అలాంటప్పుడు కోహ్లీ ఎందుకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉండకూడదు? నేను ఈ విషయంలో సరైన ప్రశ్ననే లేవనెత్తానని అనుకుంటున్నాను’’ అంటూ బద్రినాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

అక్కడున్నది విరాట్​ కోహ్లీ మరి - దెబ్బకు రెండు వికెట్లు డౌన్​

విరాట్ కోహ్లీ సెన్సేషన్- 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు

ABOUT THE AUTHOR

...view details