Gavaskar about kohli: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంత కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపం లేకపోయినా.. తరచూ ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతులను వేటాడి పెవిలియన్ చేరుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోహ్లీ ఈ బలహీనతను అధిగమించాలంటే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నుంచి సలహా తీసుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సూచించాడు.
"విరాట్ కోహ్లీ నూతన సంవత్సరం సందర్భంగా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపి.. ఓ సలహా అడిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. టీమ్‌ఇండియా 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో.. ఆఫ్‌సైడ్ బంతులను ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలి. మూడో టెస్టు మ్యాచ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాక మళ్లీ అలాంటి షాట్లు ఆడబోనని సచిన్ చెప్పాడు. ఆ తర్వాత సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ సైడ్ బంతులను వదిలేసి ఆడాడు. కేవలం మిడ్ ఆఫ్, స్ట్రెయిట్, ఆన్‌సైడ్ మాత్రమే షాట్లు ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు నాటౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 60 నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకోవాలి."