తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli: 'వంద టెస్టులు ఆడతానని నిజంగా ఊహించలేదు' - రోహిత్​ శర్మ

Virat Kohli: విరాట్​ కోహ్లీ ప్రతిష్ఠాత్మకమైన తన వందో టెస్ట్ మ్యాచ్​​పై స్పందించాడు. వంద టెస్ట్​ మ్యాచులు ఆడతానని ఊహించలేదన్నాడు. భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ సైతం కోహ్లీ ఘనతపై తన అభిప్రాయాన్ని చెప్పాడు.

virat kohli with rohit sharma
విరాట్​ కోహ్లీతో రోహిత్​ శర్మ

By

Published : Mar 3, 2022, 6:22 PM IST

Virat Kohli: వందో టెస్ట్​ మ్యాచ్​ ఆడతానని ఎప్పుడూ ఊహంచలేదన్నాడు భారత బ్యాటర్ విరాట్​ కోహ్లీ. శ్రీలంకతో జరిగే టెస్ట్​ సిరీస్​లోని మొదటి టెస్ట్​తో ఈ మార్కును అందుకోనున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్​తోనే కోహ్లీ వందో టెస్ట్​ పూర్తికావాల్సి ఉంది. కానీ వెన్నునొప్పితో ఆడలేదు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టెస్ట్​కు మొహాలి స్టేడియంలో 50శాతం ప్రేక్షకులను అనుమతిచ్చారు.

"వందో టెస్ట్ మ్యాచులు ఆడతానని నిజంగా ఊహించలేదు. ఇది ఒక సుధీర్ఘ ప్రయాణం. ఈ వంద టెస్టుల్లో చాలా క్రికెట్​ ఆడాను. దేవుడి దయతో వందో టెస్ట్​ ఆడుతున్నాను సంతోషంగా ఉంది. ఇది నాకు, నా కుటుంబానికి, నా కోచ్​కు ప్రత్యేకమైన క్షణం. తక్కువ పరుగులు, ఎక్కువ పరుగులు సాధిస్తానని అనుకోలేదు. జూనియర్​ క్రికెట్లో అనేక డబుల్​ శతకాలు చేశాను. చాలా ఎక్కువసేపు బ్యాటింగ్​ చేయాలన్నది నా ఆలోచన. టెస్ట్​ క్రికెట్​ మనుగడ సాగించాల్సిన ఆవశ్యకత ఉంది. నా వరకు ఇదే నిజమైన క్రికెట్​."

-విరాట్​ కోహ్లీ

గతేడాదే కోహ్లీ టెస్ట్​ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఇండియా తరఫున అత్యధికంగా 68 టెస్ట్​ మ్యాచులకు నాయకత్వం వహించి రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్​ తరఫున అత్యధికంగా టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్​గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు గ్రేమ్​ స్మిత్​, రికీ పాంటింగ్​, స్టీవ్​ స్మిత్​లు కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు ఏడు డబుల్​ సెంచరీలు సాధించాడు. కెప్టెన్​గా 20 సెంచరీలు చేసిన కోహ్లీ భారత్​ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్​గానూ రికార్డు సృష్టించాడు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అక్టోబర్​ 2016 నుంచి మార్చి 2020 వరకు 42 నెలల పాటు అగ్రస్థానంలో కొనసాగింది.

కోహ్లీ 2019లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి అభిమానులందరూ అతడి 71వ శతకం కోసం వేచి చూస్తున్నారు. ఈ వందో టెస్ట్​లో కోహ్లీ సెంచరీ చేస్తే ఈ తరంలోనే మేటి ఆటగాడిగా నిలిచిపోతాడు.

విరాట్​ కోహ్లీ వందో టెస్ట్​పై భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ స్పందించాడు. జట్టును ఉన్నత స్థాయిలో ఉంచిన ఘనత విరాట్​ కోహ్లీకే దక్కుతుందన్నాడు. శుక్రవారం శ్రీలంకతో మొదలయ్యే మ్యాచ్​తో రోహిత్​ టెస్ట్​ కెప్టెన్​గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నాడు.

" ఒక టెస్ట్​ జట్టుగా ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయిలో నిలిపేలా కృషి చేసిన కోహ్లీకే ఈ ఘనత దక్కుతుంది. అతడు టెస్ట్​ జట్టుకు చేసిన కృషి అద్భుతమైనది. అతడు వదిలేసిన స్థానాన్ని నేను తీసుకోవాలి. సరైన ఆటగాళ్లతో సరైన ఆట ఆడించాలి. వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​లో మేము వెనుకబడ్డాం. కానీ గత రెండు, మూడేళ్లలో మేము తప్పులు చేశామని నేను అనుకోవట్లేదు. అరంగేట్రం చేసిన నాటి నుంచి అతడి ప్రయాణం అద్భుతంగా సాగింది. ఇప్పుడు వందో టెస్ట్​ వరకు చేరుకున్నాడు. టెస్ట్​ ఫార్మాట్​లో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్​ను అతడి కోసం ప్రత్యేకంగా మార్చుతాం. ఐదురోజులు సాగే మ్యాచ్​లో కోహ్లీ ఆటను చూడటానికి అభిమానులు వస్తున్నారు ఇది మంచి పరిణామం. కోహ్లీ కెప్టెన్​గా 2018 ఆస్ట్రేలియాలో సాధించిన సిరీస్​ విజయం అద్భుతమైనది. బ్యాటింగ్​ విషయానికి వస్తే 2013లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ కొట్టిన శతకం ఉత్తమమైనది. జోహన్నెస్​​బర్గ్​లోని బౌన్సీ పిచ్​పై డేల్​ స్టెయిన్, మోర్ని మోర్కెల్​, జాక్వస్​ కల్లిస్​ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు.​ ఆ మ్యాచ్​లో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్​లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్​లో 90 కొట్టాడు. ఈ శతకం నా దృష్టిలో అత్యత్తమైంది."

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్​

ఇదీ చదవండి:టెస్టు చరిత్రలో స్వర్ణయుగం.. కోహ్లీ శకం- ఈ రికార్డులపై ఓ లుక్కేయండి

ABOUT THE AUTHOR

...view details