తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్లపై ఆ ఆరోపణలు సరికాదు' - వన్ 8రెస్టారెంట్​పై విమర్శలు

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వన్8 రెస్టారెంట్​ అవుట్​లెట్లపై(one 8 commune restaurant) లింగవివక్ష ఆరోపణలు వచ్చాయి. పుణెలోని వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్ అవుట్‌లోకి స్త్రీ-పురుష, సాధారణ మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారని 'యస్‌వుయ్‌ఎగ్జిస్ట్‌ ఇండియా' గ్రూప్‌ సభ్యులు విమర్శించారు.

one 8
వన్ 8 రెస్టారెంట్

By

Published : Nov 17, 2021, 7:28 AM IST

తమ అవుట్‌లెట్లపై వచ్చిన లింగవివక్ష ఆరోపణలను వన్8 కమ్యూన్‌ రెస్టారెంట్‌(one 8 commune restaurant) ఖండించింది. స్వలింగ సంపర్కులు, గే కమ్యూనిటీ సభ్యుల ప్రవేశంపై వివక్ష చూపుతోందని 'యస్‌వుయ్‌ఎగ్జిస్ట్‌ ఇండియా' గ్రూప్‌ సభ్యులు ఆరోపించారు. పుణెలోని వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్(one 8 commune news) అవుట్‌లోకి స్త్రీ-పురుష, సాధారణ మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారని విమర్శించారు. రెస్టారెంట్‌కు సంబంధించిన ఇతర శాఖల్లోనూ ఇదే వివక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఎలాంటి లింగబేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపింది. 'మా రెస్టారెంట్ నిబంధనలనుబట్టి మేం మొదట్నుంచి అందరికి మా సేవలను అందిస్తున్నాం. ఎల్లప్పుడూ కలుపుకొని వెళ్తున్నాం' అని పేర్కొంది. పారిశ్రామిక నిబంధనల మేరకే తమ నియమాలు ఉంటాయని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరిని అనుమతించకూడదనే నిబంధనలను పెట్టుకున్నట్లు వెల్లడించింది.

LGBTQIA+ గ్రూప్‌ అడిగిన ప్రశ్నకు రెస్టారెంట్ యాజమాన్యం సామాజిక మాధ్యమం ద్వారా సమాధానం ఇచ్చింది. స్వలింగ సంపర్కులు, ఇలాంటి గ్రూప్‌ సభ్యులకు రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని తెలిపింది. ట్రాన్స్‌జండర్‌ మహిళలను వారి దుస్తులను బట్టి అనుమతినిస్తామని పేర్కొంది. అందుకోసమే తమ పాలసీల గురించి ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని, తమమీద తప్పుడు ముద్ర వేయకూడదని కోరుతున్నట్లు తెలిపింది. భారత క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి(Virat Kohli News) చెందినవే వన్‌8 కమ్యూన్ చైన్‌ రెస్టారెంట్లు. దీంతో నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్‌గా మారింది.

ABOUT THE AUTHOR

...view details