తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ-డివిలియర్స్​.. కోహ్లీ ఫేవరెట్​ క్రికెటర్​ ఎవరో తెలుసా? - కోహ్లీ ఫేవరెట్ క్రికెటర్​

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ- దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్​ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మరి వీరిద్దరిలో ఎవరంటే స్టార్ బ్యాటర్​ కోహ్లీకి ఇష్టమో తెలుసా?

Kohli
మహీ-డివిలియర్స్​.. కోహ్లీ ఫేవరెట్​ క్రికెటర్​ ఎవరో తెలుసా?

By

Published : Apr 7, 2023, 11:13 AM IST

మోడ్రన్ క్రికెట్​లో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ- దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్​ ఏబీ డివిలియర్స్ అంటే తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు. భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనత మహీదైతే.. తన బ్యాటింగ్ స్కిల్స్​తో క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రికెటర్​ డివిలియర్స్. వీరిద్దరు.. చాలా మందిపై తమ ప్రభావం చూపారు. అయితే ఈ ఇద్దరితోనూ టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

టీమ్​ఇండియా ధోనీ-కోహ్లీల బంధం ఎంతో ప్రత్యేకం. మహీని.. విరాట్​ కోహ్లీ ఓ గురువుగా భావిస్తాడు. ఈ విషయాన్ని ఇప్పటికే సందర్భం దొరికిన ప్రతీసారి విరాట్ బహిరంగంగానే చెప్పాడు. ఎన్నో సార్లు తనకు అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లీ-డివిలియర్స్​ల మధ్య ఉన్న స్నేహబంధం అందరికీ తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే వీరిద్దరూ.. తమ బ్యాటింగ్​తో అభిమానులను ఎంతగానో అలరించారు. ఇద్దరు కలిసి ఎంతో సరదాగా కలిసి ఉంటారు.

మరి ధోనీ-డివిలియర్స్​.. వీరిద్దరిలో ఎవరంటే ఛేజింగ్ మాస్టర్​ కోహ్లీకి బాగా ఇష్టమో తెలుసా? తాజాగా ఈ ప్రశ్నే విరాట్​కు ఎదురైంది. ఐపీఎల్ టెలివిజన్ బ్రాడ్​కాస్టర్​ స్టార్ స్పోర్ట్స్​లో వచ్చిన ఓ టీవీ షోలో కోహ్లీని ఈ ప్రశ్న అడిగారు. 'ఎంఎస్‌డీ-డివిలియర్స్'.. ఈ ఇద్దరిలో మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు? అని అడగగా.. విరాట్​ ముందు నవ్వి ఆ తర్వాత ఇంటెలిజెంట్​గా బదులిచ్చాడు. తనకు ఇద్దరూ ఇష్టమేనని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రాగా, క్రికెట్​ ఫ్యాన్స్​ షేర్​ చేస్తున్నారు. దీంతో అది ట్రెండ్ అవుతోంది.

ఇంకా ఈ వీడియోలో విరాట్​ తన ఇష్టాలేంటో చెప్పుకొచ్చాడు. తనకు ఫ్లిక్ షాట్ కన్నా కవర్ డ్రైవ్ అంటే ఇష్టమని అన్నాడు. అడిలైడ్ ఓవల్​లో చిరస్మరణీయ ఇన్నింగ్స్​లు ఆడినా చిన్నస్వామి స్టేడియం అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. చాహల్ గేల్​లో ఎవరు ఎక్కువగా నవ్వించే క్రికెటర్ అని అడగగా.. గేల్ అని సమాధానమిచ్చాడు. స్టార్ సింగర్స్​ పంజాబ్ సింగర్ గురుదాస్ మన్ - అర్జిత్​ సింగ్.. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమనగా.. 'ఇది చాలా టఫ్' అని చెప్పాడు. మళ్లీ అర్జిత్​ సింగ్ సాంగ్స్​ అంటే ఇష్టమని కూడా తెలిపాడు. జిమ్​లో కార్డియో కన్నా వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్​ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి:IPL 2023: ఆర్సీబీ చెత్త రికార్డు.. విరాట్​తో కలిసి స్టెప్పులేసిన షారుక్​ ఖాన్

ABOUT THE AUTHOR

...view details