తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విజ్డెన్​ అల్మనాక్​ వన్డే క్రికెటర్'​గా కోహ్లీ

ఇప్పటికే ఎన్నో ఘనతల్ని తన పేరిట నమోదు చేసుకున్న కోహ్లీ.. మరో అరుదైన గౌరవం పొందేందుకు సిద్ధమయ్యాడు. విజ్డెన్ అల్మనాక్​ వన్డే క్రికెటర్ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు.

Virat Kohli named Wisden Almanack's ODI cricketer of the 2010s
'విజ్డెన్​ అల్మనాక్​ వన్డే క్రికెటర్'​గా కోహ్లీ

By

Published : Apr 15, 2021, 3:38 PM IST

Updated : Apr 15, 2021, 4:06 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2010 దశాబ్దపు విజ్డెన్​ అల్మనాక్​ వన్డే క్రికెటర్​గా ఎంపికయ్యాడు. 2011-20 మధ్య కాలంలో అతడు 60 సగటుతో 11 వేలకు పైగా పరుగులు చేయడమే ఇందుకు కారణం. ఈ పదేళ్ల కాలంలో 2011 ప్రపంచకప్​, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ 50 ఓవర్ల ఈవెంట్లు ఐదింటిలో కోహ్లీ పాల్గొన్నాడు.

దిగ్గజ సచిన్ తెందూల్కర్​ను 1990 దశాబ్దానికి, కపిల్​దేవ్​ను 1980 దశాబ్దానికి విజ్డెన్​ వన్డే క్రికెటర్లుగా అవార్డులు పొందారు.

'విజ్డెన్ లీడింగ్ క్రికెటర్​ ఆఫ్ ద వరల్డ్ 2020'గా ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ బెన్ స్టోక్స్ వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. కీరన్ పొలార్డ్.. 'టీ20 క్రికెటర్​ ఆఫ్ ద ఇయర్​'గా, బెత్ మూనీ(ఆసీస్).. 'లీడింగ్ మహిళా క్రికెటర్​'గా ఎంపికయ్యారు.

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్

అంతకు ముందు ఇదే ఏడాది ప్రారంభంలో కోహ్లీ.. ఐసీసీ దశాబ్దపు క్రికెటర్, ఐసీసీ దశాబ్దపు వన్డే క్రికెటర్​గానూ నిలిచాడు. ఐసీసీ దశాబ్దపు టెస్టు జట్టులో కెప్టెన్​గానూ స్థానం దక్కించుకున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 15, 2021, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details