బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్ కునెమెన్ బౌలింగ్‌లో విరాట్ బొటనివేలికి గాయమైంది. అసలేం జరిగిందంటే?
IND Vs AUS: విరాట్ కోహ్లీకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్! - virat kohli injured
భారత్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. ఆస్టేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఓ షాట్ కొట్టే సమయంలో అతడి బొటనవేలికి గాయమైంది.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ నుంచి ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇదే మ్యాచులో మళ్లీ స్పిన్నర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే కునెమాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ షాట్ ఆడుతూ కోహ్లీ బొటనవేలికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి అతడి వేలికి కట్టు కట్టాడు. ఇది జరిగిన కాసేపటికే అంటే నాలుగు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై పెవిలియన్‌కు చేరాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ గాయం చిన్నదా పెద్దదా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఈ మ్యాచ్‌లోనే ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా గాయపడ్డాడు. రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించాడు. ఆటపై తన అంకితభావాన్ని ప్రదర్శించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.