తెలంగాణ

telangana

ETV Bharat / sports

నార్వే గ్రూప్​తో కోహ్లీ డ్యాన్స్​.. ఫైర్​ అయిన అనుష్క శర్మ! - కోహ్లీ నార్వే గ్రూప్ క్విక్​ డ్యాన్స్​

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ముంబయి వెళ్లిన కోహ్లీ.. ప్రస్తుతం బ్రేక్​ టైమ్​లో చిల్ అవుతున్నాడు. తాజాగా నార్వేకు చెందిన డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్​తో కలిసి స్టెప్పులేశాడు. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై అతడి భార్య అనుష్క శర్మ కూడా స్పందించింది.

KOhli
నార్వే గ్రూప్​తో కోహ్లీ డ్యాన్స్​.. ఫైర్​ అయిన అనుష్క శర్మ!

By

Published : Mar 15, 2023, 10:09 AM IST

టీమ్​ఇండియా స్టార్​ విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ బ్యాటరే కాదు.. ఓ మంచి డ్యాన్సర్​ కూడా. గతంలోనూ చాలా సార్లు అతడు స్టెప్పులేస్తూ కనిపించాడు. అయితే ఇప్పుడు మరోసారి అతడు తనదైన స్టైల్​లో చిందులేసి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ముంబయి వెళ్లిన కోహ్లీ.. అక్కడ సరదాగా గడుపుతున్నాడు. నార్వే డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్​తో కలిసి చిందులేశాడు. స్టీరియో నేషన్​కు చెందిన ఇష్క్ అనే సాంగ్​కు విరాట్ డ్యాన్స్ చేశాడు.

ఈ వీడియోను కోహ్లీయే స్వయంగా తన సోషల్​మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో మొదటగా గ్రూపులోని ఓ డ్యాన్సర్ కింద పడి ఉన్న బ్యాట్ పట్టుకుని ఏం చేయాలా అన్నట్టుగా చూస్తుంటాడు. ఆ తర్వాత కోహ్లీ.. వైట్ టీషర్ట్, బ్లాక్ జీన్స్​లో సింపుల్​గా ఎంట్రీ ఇచ్చి.. ఆ బ్యాట్​ పట్టుకుని స్టెప్పులు వేశాడు.

బ్యాట్ పట్టుకొని ఎలా బ్యాటింగ్ చేయాలో వాళ్లకు నేర్పిస్తున్నట్లు కనిపించాడు. అలా బ్యాటింగ్ చేయడం నేర్పిస్తూనే స్టైల్​గా స్టెప్పులేశాడు. ఆ డ్యాన్స్ మూమెంట్స్​, కోహ్లీ ఎక్స్​ప్రెషన్స్​ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. 'క్లిక్ స్టైల్​ను కోహ్లీ కలిస్తే ఇలా ఉంటుంది' అనే క్యాప్షన్​తో ఈ వీడియోను పోస్ట్​ చేశారు. ఈ వీడియో పోస్ట్​ చేసిన కాసేపట్లోనే సోషల్​ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దీనికి నెటిజన్లు, విరాట్ అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. తెగ లైక్స్​, కామెంట్స్​ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్​ వీడియోపై విరాట్ భార్య, హీరోయిన్​ అనుష్క శర్మ కూడా రియాక్ట్ అయింది. ఫైర్ ఎమోజీలను పోస్ట్​ చేసింది. 'కోహ్లీ 76వ సెంచరీ డ్యాన్స్ ముందే లీకైంది', 'చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్​ కన్నా బాగా డ్యాన్స్ చేశావు', 'కోహ్లీ భయ్యా నువ్వు సూపర్​, డ్యాన్స్ అదిరింది', డ్రెస్సింగ్​ స్టైల్​, లుక్​, డ్యాన్స్​ సూపర్​ అంటూ యూజర్స్​​ సరదా కామెంట్లు చేస్తున్నారు.

కాగా, అంతకుముందు ఈ డ్యాన్స్ గ్రూపు సభ్యులతోనూ కోహ్లీ ఓ ఫొటో దిగి సోషల్​మీడియాలో షేర్ చేశాడు. ఇండియన్ సాంగ్స్​కు డ్యాన్స్ చేస్తూ.. నార్వేకు చెందిన ఈ క్విక్ స్టైల్ గ్రూప్​ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ గ్రూప్​ ఇండియా టూర్​లో ఉంది. ఈ క్రమంలోనే ఆ బృందం కోహ్లీతో కలిసి సరదాగా గడిపింది. అలా అతడితో కలిసి డ్యాన్స్​ వేసింది.

ఇదీ చూడండి:వరుసగా 5 ఓటములు.. కానీ ఆర్సీబీకి ఎలిమినేటర్​ ఛాన్స్​.. ఎలా అంటే?

ABOUT THE AUTHOR

...view details