రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బౌలర్లను సరిగా అర్థం చేసుకుంటాడని తెలిపాడు ఆ జట్టు బౌలర్ హర్షల్ పటేల్. బౌలర్లకు మద్దతుగా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు. బెంగళూరు జట్టులో సానుకూల వాతావరణం ఉంటుందని పేర్కొన్నాడు. కోహ్లీ బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాడని హర్షల్ చెప్పాడు.
"నన్ను జట్టులోకి తీసుకున్న రోజే.. 'తిరిగి స్వాగతం, మీరు ఇక్కడ ఆడబోతున్నారు' అంటూ విరాట్ నుంచి ఒక సందేశం వచ్చింది. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను ఆడటానికి ఇదే సరైన జట్టు అనిపించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదే సరైన టీమ్ అనిపించింది. మనం ఏ విధంగా బౌలింగ్ చేస్తామన్న కోహ్లీ అంగీకరిస్తాడు. మన ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమైనా.. అతడు సరిగా అర్థం చేసుకుంటాడు."
-హర్షల్ పటేల్, ఆర్సీబీ బౌలర్.