టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ(virat kohli captaincy in t20) గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అతడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. పని భారం వల్లే తప్పుకొంటున్నానని కోహ్లీ వెల్లడించినా.. దీనికి మరేదో కారణముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ-రోహిత్ మధ్య మనస్పర్థలు(kohli rohit rift) మరోసారి చర్చకు వచ్చాయి. కోహ్లీ తప్పుకోవడానికి కారణం వారి మధ్య విభేదాలేనని(kohli rohit rift) తెలుస్తోంది. ఇదే విషయమై పీటీఐలో వచ్చిన ఓ సంచలన వార్త మరింత ఆసక్తిని రేకెత్తించింది.
పరిమిత ఓవర్ల జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాలని కోహ్లీ(kohli rohit rift).. బీసీసీఐకి డిమాండ్ చేశాడన్నది ఆ వార్తల సారాంశం. రోహిత్ వయసు 34 ఏళ్లని, అతడిని పక్కన పెట్టి వన్డేల్లో కేఎల్ రాహుల్(kl rahul vice captain)కు, టీ20ల్లో రిషబ్ పంత్(rishabh pant news)కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని విరాట్ కోరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సెలక్షన్ కమిటీకి చెప్పగా.. అది కాస్తా బోర్డు దృష్టిలో పడి కోహ్లీపై అసంతృప్తికి కారణమైందట. ఓ సక్సెస్ఫుల్ ఆటగాడిని కోహ్లీ గుర్తించలేకపోవడం పట్ల వారు కాస్త నిరాశకు గురయ్యారట.