Vijay Hazare Trophy 2021 Hyderabad Team: విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఉత్తర్‌ప్రదేశ్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. యశ్ దయాళ్ (5/31), అంకిత్ రాజ్‌పుత్ (3/27), సమీర్ (2/16) ధాటికి 42.5 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (49; 63 బంతుల్లో 5×4, 2×6), రవితేజ (26; 62 బంతుల్లో 1×4, 1×6) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. కరణ్ శర్మ (44 నాటౌట్; 36 బంతుల్లో 4×4, 3×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని ఉత్తర్‌ప్రదేశ్ 26 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. రెండు విజయాలు, రెండు ఓటములతో హైదరాబాద్ 8 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇన్నే పాయింట్లు ఉన్న యూపీ మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉండగా.. సౌరాష్ట్ర (16) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Vijay Hazare Trophy 2021: ఆంధ్ర దూకుడు.. హైదరాబాద్‌కు రెండో ఓటమి - విజయ్ హజారే టోర్నీ ఆంధ్ర హిమాచల్ ప్రదేశ్
Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది ఆంధ్ర. అలాగే హైదరాబాద్ రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌పై ఉత్తరప్రదేశ్ విజయం సాధించగా.. హిమాచల్‌ను చిత్తుచేసింది ఆంధ్ర.
ఆంధ్రకు రెండో విజయం
Vijay Hazare Trophy 2021 Andhra: కెప్టెన్ శ్రీకర్ భరత్ (161 నాటౌట్; 109 బంతుల్లో 16×4, 8×6) మెరుపు శతకానికి అశ్విన్ హెబ్బార్ (100; 132 బంతుల్లో 10×4) సమయోచిత సెంచరీ తోడవడం వల్ల ఈ టోర్నీలో ఆంధ్ర వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఆంధ్ర 30 పరుగుల తేడాతో హిమాచల్‌ప్రదేశ్‌ను ఓడించింది. మొదట ఆంధ్ర 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. భరత్, అశ్విన్ రెండో వికెట్‌కు 174 పరుగులు జత చేసి జట్టుకు మంచి స్కోరు అందించారు. అంబటి రాయుడు (34; 14 బంతుల్లో 2×4, 3×6) చివర్లో మెరుపులు మెరిపించాడు. గిరినాథ్‌రెడ్డి (4/52) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజృంభించడం వల్ల ఛేదనలో హిమాచల్ 46 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది. గిరినాథ్‌తో పాటు నితీష్‌కుమార్ (2/51), సాయితేజ (1/47), విజయ్ (1/26) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆంధ్ర రెండు విజయాలు, రెండు ఓటములతో 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది.