Viacom 18 BCCI : ఐదేళ్ల కాలానికి సంబంధించి టీమ్ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌ల టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ వయాకామ్ 18.. తాజాగా జరిగిన వేలంలో దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు.
"ఐదేళ్ల కాలానికి బీసీసీఐ మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18కు శుభాకాంక్షలు. ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ సెక్టార్లో ఇండియన్ క్రికెట్ రానున్న రోజుల్లో మరింత ఎదుగుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తాం" అని జై షా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో ఈ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి) వరకు టీమ్ఇండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పటి నుంచి ఐదేళ్ల పాటు వైకోమ్ 18 భాతర జట్టు మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. ఇక ప్రసారం చేసిన ప్రతి మ్యాచ్‌కు మీడియా హక్కుల రూపంలో రూ.67.8 కోట్లు అందుకోనుంది.
ఇప్పుడీ మీడియా హక్కులతో వయాకామ్ క్రీడా ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు అయింది. భారత మ్యాచ్‌లతో పాటు, ఐపీఎల్ (డిజిటల్), మహిళా ప్రీమియర్ లీగ్ 2024, పారిస్ ఒలింపిక్స్ 2024, టీ10 లీగ్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా20 ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, ఎన్‌బీఏ, డైమండ్ లీగ్.. ఇలా ప్రపంచవ్యాప్తంగా గేమ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది.
BCCI Media Rights : ఇక భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లుజియో సినిమాలో కూడా లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జియో సినిమా ఇదివరకే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను (ఐపీఎల్ డిజిటల్ రైట్స్) దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ 22న స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి బీసీసీఐ కొత్త మీడియా పార్ట్‌నర్ ప్రయాణం మొదలుకానుంది.
BCCI Tender For Media Rights : మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండర్.. ఈ సారి ఎన్ని కోట్ల లాభమో?
BCCI Revenue Share : బీసీసీఐకి కాసుల పంట.. ICC షేర్ ఏడాదికి రూ.2 వేల కోట్లు