ఐసీసీ విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్(icc ranking t20)లో టీమ్ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ(shafali verma icc ranking) తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా(indw vs ausw t20)తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన ఈ బ్యాటర్.. తన ర్యాంకును కోల్పోయింది. మరో బ్యాటర్ స్మృతి మంధాన (smriti mandhana ranking) మూడో ర్యాంకును కాపాడుకుంది. భారత్-ఆసీస్ టీ20 సిరీస్(indw vs ausw t20)లో అత్యధిక పరుగులు సాధించిన కంగారూ బ్యాటర్ బెత్ మూనీ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సిరీస్లో మూనీ మూడు మ్యాచ్ల్లో 47.50 సగటుతో 95 పరుగులు చేసింది. ఇందులో ఓ అర్ధశతకం కూడా ఉంది. కాగా, షెఫాలీ కేవలం 22 రన్స్ మాత్రమే చేసింది. వీరు మినహా బ్యాటింగ్ టాప్-10లో ఏ మార్పులూ చోటు చేసుకోలేదు.
ICC Rankings: అగ్రస్థానం కోల్పోయిన షెఫాలీ వర్మ
ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్(icc ranking t20)లో అగ్రస్థానాన్ని కోల్పోయింది టీమ్ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ(shafali verma icc ranking). స్మృతి మంధాన(smriti mandhana ranking) తన 3వ ర్యాంకును కాపాడుకుంది.
Verma
బౌలర్ల విభాగంలో ఆసీస్తో టీ20 సిరీస్(indw vs ausw t20)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచిన బారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 12వ స్థానానికి ఎగబాకింది. కంగారూ జట్టు ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ 12 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకుకు చేరుకుంది.