తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెలక్షన్​కమిటీ, టీమ్​ఇండియా గొడవ.. దాదా స్పందన - టీ20 ప్రపంచకప్​పై గంగూలీ

పృథ్వీ షా, దేవదత్​ పడిక్కల్​ను(prithvi shah, Devadutt padikkal) ఇంగ్లాండ్ పర్యటనకు​ పంపించే విషయమై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. ఆస్ట్రేలియాతో గులాబి టెస్టుకు ముందు భారత మహిళల జట్టుకు ప్రాక్టీస్​గా పింక్​ బాల్​ మ్యాచ్​లు​ ఆడించడం కుదరదని స్పష్టం చేశాడు.

ganguly
గంగూలీ

By

Published : Jul 8, 2021, 9:34 PM IST

గాయపడిన శుభమన్​గిల్​ స్థానంలో శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, దేవదత్​ పడిక్కల్​ను(prithvi shah, Devadutt padikkal) ఇంగ్లాండ్​ పంపించే విషయమై కొద్దిరోజులుగా చర్చజరుగుతోంది. గిల్​ స్థానంలో ఇద్దరు ఓపెనర్లు కావాలని సెలక్షన్ కమిటీ ఛైర్మన్​ చేతన్​ శర్మకు టీమ్​ మేనేజ్​మెంట్​ విజ్ఞప్తి చేయగా ఆయన పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది. బీసీసీఐ, సెలక్షన్​ కమిటీ, జట్టుయాజమన్యం మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించట్లేదని అంతా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(BCCI President Ganguly)... వారిద్దరిని పంపించే విషయమై నిర్ణయం సెలక్టర్ల మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు.

అందుకోసమే యూఏఈకి

ముందుగా నిర్ణయించినట్లుగానే ఐపీఎల్(IPL) రెండో దశ​ యూఏఈలో సవ్యంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గంగూలీ. అందరీ భద్రత దృష్టిలో ఉంచుకుని భారత్​ వేదికగా అక్టోబర్​-నవంబరులో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 World cup)​ యూఏఈకి తరలించినట్లు వెల్లడించారు.

"అక్కడ నిర్వహించడం కాస్త బాధకరమైన విషయం. కానీ జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించం. గతేడాది కోరనా కారణంగా రద్దు అయిన ప్రపంచకప్​ ఈ ఏడాది కూడా అదే కారణంగా రద్దు అయింది. దీనివల్ల ఆటకు భారీ నష్టం కలిగింది. అందుకే సురక్షితమైన ప్రాంతంలో ఈ మెగాటోర్నీని నిర్వహించాలని నిర్ణయించాం" అని అన్నాడు.

ఫిట్​గా ఉన్నా

జనవరిలో దాదా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ఫిట్​నెస్​పై స్పందిస్తూ.. "నేను పూర్తి ఫిట్​గా ఉన్నాను. ఇది కొవిడ్​ సమయం. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ల కోసం జాగ్రత్తగా ఉండండి." అని పేర్కొన్నాడు.

అస్సలు కుదరదు

భారత మహిళల జట్టు త్వరలోనే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్(Pink Ball Test) ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు ప్రాక్టీస్​ కోసం ఆగస్టులో దేశవాళీల్లో పింక్​ బాల్​ మ్యాచ్​లు​ నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ సభ్యురాలు శాంతా రంగస్వామి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన దాదా.. అది సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఆ సమయంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అన్నాడు.

ఈ పర్యటన సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్​ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. 2006లో ఆసీస్​తో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. సెప్టెంబర్​లో జరిగేది రెండోది.

ఇదీ చూడండి: సినిమాను తలపించేలా 'దాదా' డేరింగ్ ప్రేమ కథ

ABOUT THE AUTHOR

...view details