తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS AUS: వన్డే సిరీస్​కు రెడీ.. ఆ మూడు రికార్డులను కోహ్లీ అందుకుంటాడా? - టీమ్​ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్​

ఆస్ట్రేలియాతో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీని పలు రికార్డులను ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Teamindia Australia ODI Series Virat  Kohli records
IND VS AUS: వన్డే సిరీస్​కు రెడీ.. ఆ మూడు రికార్డులను కోహ్లీ అందుకుంటాడా?

By

Published : Mar 16, 2023, 7:18 PM IST

Updated : Mar 16, 2023, 7:57 PM IST

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సిరీస్‌లో అతడు కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. అదేంటంటే.. అహ్మదాబాద్ టెస్టులో మంచి ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్న విరాట్​.. వన్డే సిరీస్‌లో కూడా అలాగే ఆడాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. ఒకవేళ అభిమానులు ఆశించినట్టు కోహ్లీ అద్భుతంగా ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకుంటే.. అతడు మరో అరుదైన ఘనతను సాధించినట్టువుతుంది. ఆస్ట్రేలియాపై అత్యధికంగా ఈ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్​ రెండో స్థానంలో నిలుస్తాడు.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో అందుకున్న అవార్డు.. ఆసీస్‌పై కోహ్లీకి తొమ్మిదోది. ఇంకొక్క అవార్డును అతడు ముద్దాడితే వివ్ రిచర్డ్స్, ఇయాన్ బోథమ్‌తో సమానంగా పది 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులతో రెండో స్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు ఆసీస్​పై ఏకంగా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డులు అందుకున్నాడు.

ఇకపోతే ఆస్ట్రేలియాపై చెలరేగిపోయే బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అయితే జరగబోయే వన్డే సిరీస్​లో అతడు మరో సెంచరీ చేస్తే.. కంగారులపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుకెక్కుతాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో బాదిన శతకం కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్‌లో 75వది. వీటిలో 16 శతకాలు ఆసీస్‌పై బాదినవే. ఇక వన్డేల్లో ఆసీస్​పై కోహ్లీ 8 శతకాలు బాదాడు. ఇక జరగబోయే ఈ మూడు మ్యాచులో వన్డే సిరీస్‌లో ఒక్క సెంచరి బాదితే .. ఆసీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్​గా సచిన్ రికార్డును సమం చేస్తాడు విరాట్​. లేదంటే అధిగమించే అవకాశం ఉంటుంది.

ఇంకా ఆసీస్‌తో జరిగబోయే వన్డే సిరీస్‌లో మరో మైలురాయిని కూడా కోహ్లీ చేరుకునే ఛాన్స్​ ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి విరాట్​ అతి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 262 వన్డే ఇన్నింగ్సుల్లో 12 వేల 809 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక తాజా సిరీస్‌లో మరో 191 పరుగులు చేస్తే.. 13 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన ప్లేయర్​గా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:ఐపీఎల్‌ 2024లోనూ మహీ ఆడతాడా? రైనా ఏం చెప్పాడంటే?

Last Updated : Mar 16, 2023, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details