సౌథాంప్టన్ వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ తలపడనున్నాయి. జూన్ 16 నుంచి 22 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే దీనికి వీక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా హాజరుకానున్నారని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను యూకేలో నిర్వహించేలా ఇంగ్లాండ్ క్రికెట్బోర్డుతో బీసీసీఐ చర్చలు జరిపే అవకాశముందని అన్నారు.
ప్రసిద్ధ్కృష్ణకు వ్యాక్సిన్ లేనట్టేనా
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో సిరీస్కోసం యూకే వెళ్లనున్న టీమ్ఇండియా ఆటగాళ్లకు పర్యటనకు ముందే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇవ్వనున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. అయితే శనివారం కరోనా బారిన పడిన ప్రసిద్ధ్ కృష్ణకు టీకా తీసుకునే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే వైరస్ నుంచి కోలుకున్నా నాలుగు వారాల తర్వాత మాత్రమే బాధితుడు వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలి. అయితే యూకే పర్యటనకు టీమ్ఇండియా జూన్ 2న బయలుదేరనుంది. దీనిప్రకారం మే 18 లేదా 20వ తేదీన ప్రసిద్ధ్‌కు నెగటివ్ తేలిన జూన్ 2 నాటికి అతడు టీకాను తీసుకోలేడు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ పర్యటనకు భారత క్రికెటర్లు కుటుంబంతో సహా!